Viral News : అదృష్టం అంటే ఇతనిదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..!

October 10, 2021 9:05 AM

Viral News : సాధారణంగా ఎవరైనా వాంతి చేసుకుంటున్నారంటే మనం అక్కడి నుంచి పరుగులు పెడతాము. అయితే ఓ మత్స్యకారుడిని ఆ వాంతి ఏకంగా కోటీశ్వరుడిని చేసింది. వాంతి అంటే మనం చేసుకునేది కాదండోయ్.. తిమింగలం వాంతి.. దాని ద్వారా ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌ లో చోటు చేసుకుంది. థాయిలాండ్ కు చెందిన నారోంగ్ ఫేచరాజ్ అనే మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళుతూ రూ.20వేల వరకు సంపాదించేవాడు.

Viral News man become millionaire with whale vomiting

అయితే ఒకరోజు నారోంగ్ ఫేచరాజ్ సూరత్ థానీ ప్రాంతంలోని నియోమ్ బీచ్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో అతనికి సముద్ర తీరంలో ఒక వింతైన వస్తువు కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన అతను దానిని తీసుకొని అధికారులకు అప్పగించి ఎంతో కొంత డబ్బును వారి నుంచి పొందాలని భావించాడు. దానిని సోంగ్లా యూనివర్సిటీ అధికారులకు అప్పగించగా వారు దానిని పరిశీలించి ambergrisగా గుర్తించారు.

మగ తిమింగలం తిన్న పదార్థాలు జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకున్న దానిని ambergrisగా పిలుస్తారు. అయితే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని వివిధ రకాల పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగించడం వల్ల దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇలా ఆ మత్స్యకారుడి దొరికిన 30 కిలోల ambergris కు రూ.10 కోట్లు వచ్చాయి. దీంతో అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now