Viral News : వామ్మో.. ఈ చేప ధ‌ర ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.2.60 ల‌క్ష‌లు..!

October 31, 2021 11:58 AM

Viral News : ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చేప జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ర‌కాల జాతుల‌కు చెందిన చేప‌ల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే కొన్ని చేప‌లు బ‌రువు ఎక్కువ‌గా పెర‌గ‌డ‌మే కాకుండా.. అధిక ధ‌ర‌ను ప‌లుకుతుంటాయి. అలాంటి చేప‌ల గురించి గ‌తంలో మ‌నం చ‌దివాం. అయితే తాజాగా అలాంటిదే ఓ అత్యంత ఖ‌రీదైన చేప‌ను జాల‌ర్లు విక్ర‌యించారు. వివ‌రాల్లోకి వెళితే..

Viral News do you know the price of this fish rs 2.60 lakhs

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న‌ పల్లిపాలెం చేపల మార్కెట్ లో తాజాగా 21 కేజీల బరువు ఉన్న‌ కచిడి అనే జాతికి చెందిన‌ మగ చేపను భారీ ధ‌ర‌కు విక్ర‌యించారు. ఈ చేప‌కు వేలం నిర్వ‌హించ‌గా.. అత్య‌ధిక ధ‌ర ప‌లికింది. దీన్నే బంగారు చేప అని కూడా అంటారు.

ఇక వేలంలో ఆ చేప‌ను ఓ వ్య‌క్తి ఏకంగా రూ.2.60 ల‌క్ష‌ల‌కు పాడి ద‌క్కించుకున్నాడు. అయితే నిజానికి క‌చిడి జాతికి చెందిన చేప‌ల్లో ఆడ చేప క‌న్నా మ‌గ చేప‌కే ధ‌ర‌, డిమాండ్ ఎక్కువ‌గా ఉంటాయి. అందుక‌నే ఆ మ‌గ చేప‌కు అంత‌టి ధ‌ర ప‌లికింది.

క‌చిడి చేప‌ల పొట్ట భాగంలో ఉండే గాల్ బ్లాడ‌ర్‌ను బ‌లానికి వాడే మందుల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. క‌నుక ఈ చేప‌ల‌కు అధికంగా ధ‌ర ఉంటుంది. సాధార‌ణంగా శ‌స్త్ర చికిత్స చేసిన‌ప్పుడు కుట్లు వేసేందుకు ఉప‌యోగించే దారాల‌ను త‌యారు చేసేందుకు కూడా ఈ చేప గాల్ బ్లాడ‌ర్‌ను వాడుతారు. అందుక‌నే ఆ చేప‌ల‌కు అంత‌టి డిమాండ్ ఉంటుంది. ఏది ఏమైనా ఆ చేప అంత‌టి ధ‌ర ప‌ల‌క‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now