Vikram 1986 Movie : 1986లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీ క‌థ ఏమిటో తెలుసా ? దానికి, ఇప్ప‌టి విక్ర‌మ్‌కు ఎలా లింక్ పెట్టారంటే..?

July 15, 2022 4:53 PM

Vikram 1986 Movie : క‌మ‌ల‌హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. ఈ మూవీ మొత్తంగా రూ.442 కోట్ల గ్రాస్‌ను బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూలు చేసింది. క‌మ‌ల‌హాస‌న్ సినిమా కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా ఓ రికార్డును నెల‌కొల్ప‌గా.. త‌మిళ‌నాడులో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసిన మూవీగా కూడా ఇంకో రికార్డును న‌మోదు చేసింది. ఇలా విక్ర‌మ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

విక్ర‌మ్ మూవీ ప్ర‌స్తుతం ఓటీటీలోనూ రికార్డుల‌ను కొల్ల‌గొడుతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే విక్ర‌మ్ మూవీకి 1986లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీకి లింక్ పెట్టార‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి విక్ర‌మ్ మూవీని చూస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. 1986లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీకి కొన‌సాగింపుగా ఇప్ప‌టి మూవీని తీసిన‌ట్లు చూపించారు. అప్ప‌టి మూవీలో క‌మ‌ల‌హాస‌న్ ఒక స్పెష‌ల్ ఏజెంట్‌. అగ్ని పుత్ర అనే మిస్సైల్‌ను ఓ వ్య‌క్తి (స‌త్య‌రాజ్‌) దొంగిలిస్తాడు. దాంతో భార‌త్‌ను నాశ‌నం చేయాల‌ని చూస్తాడు. అయితే చివ‌ర‌కు ఏజెంట్ విక్ర‌మ్‌, కంప్యూట‌ర్ స్పెష‌లిస్ట్ ప్రీతి (లిజి)తో క‌లిసి అగ్ని పుత్ర ద్వారా క‌లిగే న‌ష్టం నుంచి భార‌త్‌ను త‌ప్పిస్తారు. ఇదీ.. అస‌లు క‌థ‌.

Vikram 1986 Movie story the link between old and new movies
Vikram 1986 Movie

ఇక 1986 విక్ర‌మ్ మూవీలో డింపుల్ కపాడియాతోపాటు అప్ప‌ట్లో పేరుగాంచిన షోలో నటుడు అంజ‌ద్‌ఖాన్ కూడా న‌టించారు. ఈయ‌న షోలో గ‌బ్బ‌ర్‌సింగ్ పాత్ర‌లో క‌నిపించారు. అయితే 1986 విక్ర‌మ్ మూవీలో క‌మ‌ల‌హాస‌న్ స్పెష‌ల్ ఏజెంట్ క‌నుక అదే క‌థను కొన‌సాగిస్తూ.. కొన్నేళ్ల త‌రువాత మ‌ళ్లీ ఏం జ‌రిగింది..? అజ్ఞాతంలో ఉన్న ఏజెంట్ విక్ర‌మ్ మ‌ళ్లీ స‌మాజంలోని చీడ‌పురుగుల‌పై ఎలా ఫైట్ చేశాడు.. అన్న‌ది ఇప్ప‌టి విక్ర‌మ్ మూవీలో చూపించారు. ఇలా ఈ రెండు సినిమాల‌కు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ చాలా తెలివిగా లింక్ పెట్టారు. సినిమా విజ‌యం సాధించ‌డంలో ఇది కూడా ఓ ముఖ్య‌పాత్ర‌ను పోషించింద‌ని చెప్ప‌వ‌చ్చు. విక్ర‌మ్ మూవీ ఇంత‌లా హిట్ అవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now