Vijay Devarakonda : లైగ‌ర్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

August 17, 2022 10:47 AM

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లో మొద‌టిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతున్న చిత్రం లైగ‌ర్. ఆయ‌న అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఆగ‌స్టు 25న తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ , మ‌ళ‌యాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా క‌థపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక విజయ్ ఈ అపోహ‌ల‌న్నింటికీ తాజాగా జ‌రిగిన ఒక‌ ప్రెస్ మీట్ లో ముగింపు ఇచ్చేసిన‌ట్లే అనిపిస్తోంది. ఈ మీడియా స‌మావేశంలో విజ‌య్ లైగ‌ర్ సినిమాపై వ‌స్తున్న‌ రూమ‌ర్స్ గురించి మాట్లాడుతూ.. అంద‌రూ ఈ చిత్రాన్ని గ‌తంలో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాకి రీమేక్ అంటున్నార‌ని, కానీ క‌చ్చితంగా అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌ని అన్నారు.

అంతే కాకుండా ఆ సినిమా అంటే త‌న‌కి ఇష్ట‌మ‌ని, ఒక‌వేళ రీమేక్ చేయాల్సి వ‌స్తే దానికి అన్నీ కుదిరితేనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపాడు. కానీ తాను రీమేక్ ల జోలికి వెళ్లే వ్య‌క్తిని కాద‌ని, అవి త‌న‌కు ఏమాత్రం స‌రిప‌డ‌వ‌ని త‌న అభిప్రాయాన్ని వివ‌రించాడు. అయితే అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో ఉన్న సినిమా అనీ, ఇక లైగ‌ర్ మూవీ అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన చిత్రం కాదని అది మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ పై రూపొందించిన సినిమా అని వివ‌రించారు.

Vijay Devarakonda told real truths about Liger movie
Vijay Devarakonda

దీంతో విజ‌య్ ఈ చిత్ర క‌థ‌పై న‌డుస్తున్న పుకార్ల‌న్నింటికీ చెక్ పెట్టేసినట్లు అయ్యింది. ఇది పూర్తిగా కొత్త క‌థ అని.. ఏ సినిమాకి కూడా అనువాదం కాద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఇక లైగ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now