Vijay Devarakonda : మ‌హేష్ వ‌ద్ద‌నుకున్న జ‌న‌గ‌న‌మ‌ణ‌.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో తీయ‌నున్న పూరీ జ‌గ‌న్నాథ్‌..?

January 28, 2022 8:07 PM

Vijay Devarakonda : గ‌త కొన్నేళ్ల కింద‌ట ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి జ‌న‌గ‌న‌మ‌ణ అనే చిత్రాన్ని తీయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఆ మూవీని పూరీ మ‌హేష్‌తో తీయ‌లేక‌పోయారు. త‌రువాత వెంక‌టేష్‌తో ఆ సినిమాను తీద్దామని పూరీ ప్లాన్ చేశారు. కానీ అది కూడా స‌క్సెస్ కాలేదు.

Vijay Devarakonda to do janaganamana movie with puri jagannadh

ఇక చివ‌ర‌కు పూరీ ఆ ప్రాజెక్టును పక్క‌న పెట్టేశారు. ఇత‌ర చిత్రాల‌తో బిజీ అయ్యారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆ మూవీని పూరీ జ‌గ‌న్నాథ్ తీస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే నెల‌లో జ‌న‌గ‌న‌మ‌ణ యూఎస్ఏలో ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.

లైగ‌ర్ మూవీతో పూరీ, విజ‌య్ ల మ‌ధ్య బాండింగ్ ఏర్ప‌డింది. లైగ‌ర్ షూటింగ్ పూర్తి అయి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో విజ‌య్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే పూరీతో క‌లిసి జ‌న‌గ‌న‌మ‌ణ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్లు విజ‌య్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అతి త్వ‌ర‌లో దీనికి సంబంధించి అధికారిక వివ‌రాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇక లైగ‌ర్ మూవీని వ‌చ్చే ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌నున్నారు. అన‌న్య పాండే ఈ మూవీలో విజ‌య్ స‌ర‌సన హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఈ మూవీలో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now