Vijay Devarakonda : నిర్మాత‌గా ఉండ‌డం నా వ‌ల్ల కావ‌డం లేదు

November 9, 2021 4:16 PM

Vijay Devarakonda : ఒకప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఇలా ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంటూ.. ఎవరి వర్క్ షెడ్యూల్ వారికి ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. ఇక ఎవరి సొంత బ్యానర్ లో వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. ఇక షెడ్యూల్ విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ చాలా పనులే ఉంటాయి. అలాంటి సినిమా రియల్ కష్టాలన్నీ ఇప్పుడు హీరోలకి, దర్శకులకు కూడా తెలుస్తున్నాయి. లేటెస్ట్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన విజయ్ కెరీర్ లో సక్సెస్ అవుతూనే.. బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

Vijay Devarakonda says he can not feel stress being producer

ఇప్పటికే రౌడీ అనే బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సొంత బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం హీరో మీదే డిపెండ్ అయి ఉండటం వల్ల పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేదని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం విజయ్ రంగంలోకి దిగాడు. చాలా ఫాస్ట్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ కష్టాలపై మాట్లాడాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రొడ్యూసర్స్ దొరక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని అన్నాడు.

అలా తనలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే సొంత బ్యానర్ నిర్మించానని అన్నారు. ఇక ప్రొడక్షన్ పనులను చాలా బాధ్యతతో చేయాలని అన్నారు. ఆఖరికి పడుకునే ముందు కూడా సినిమా గురించే ఆలోచనలు వస్తాయని, అప్పుడు మాత్రం ఇదంతా మనకు అవసరమా అని.. అనిపిస్తుందని విజయ్ అన్నారు.

పుష్పక విమానం సినిమాతో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారని అన్నారు. ఈ సినిమా ప్రీమియర్ ను నవంబర్ 11వ తేదీన నైట్ చూసి లైగర్ సినిమా కోసం అమెరికా వెళ్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత అభిమానులదేనని అన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోగా.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now