Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఇప్పుడు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సహ నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ .. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డితో హీరోగా మారి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా.. సినిమాతో నిర్మాతగా మారిన విజయ్ ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ చేశాడు.
ఈ సినిమాకి విజయ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఈవెంట్‌కి ఆనంద్ దేవరకొండ, విజయ్ ఇద్దరు వెళ్లారు. అక్కడ హోటల్‌లో బస చేశారు. పొద్దున్నే లేవగానే విజయ్.. నాతో ఈ రోజు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో చూడండి.. అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిప్పుతూ దుప్పటి లాగాడు విజయ్. నా పక్కన ఉన్నది ఎవరు చూడండి అంటూ ఆనంద్ దుప్పటి లాగుతాడు. విసుక్కుంటూ చూసిన ఆనంద్ కి విజయ్ చిరాకు తెప్పిస్తూ వీడియోలో కనిపించాడు.
ఆనంద్ వైపు కెమెరా చూపిస్తూ ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అంటూ అని అడుగుతూ ఆనంద్‌ను ఆటపట్టించాడు విజయ్. నిద్ర ముఖంతో ఉన్న ఆనంద్ కాస్తా విసుక్కుంటూ ‘నా పెళ్లాం లేచిపోయింది’ అంటూ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్ చేయడం లో భాగంగా ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…