గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Vijay Devarakonda : చిరాకు తెప్పించిన విజ‌య్.. నా పెళ్లాం లేచిపోయింద‌న్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌..

Vijay Devarakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఇప్పుడు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సహ నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ .. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డితో హీరోగా మారి ఎంతో…

Vijay Devarakonda : చిరాకు తెప్పించిన విజ‌య్.. నా పెళ్లాం లేచిపోయింద‌న్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌..

Vijay Devarakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఇప్పుడు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సహ నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ .. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డితో హీరోగా మారి ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. మీకు మాత్ర‌మే చెప్తా.. సినిమాతో నిర్మాత‌గా మారిన విజ‌య్ ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ చేశాడు.

Vijay Devarakonda made anand devarakonda irritated

ఈ సినిమాకి విజయ్ త‌న‌దైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవ‌ల వైజాగ్‌లో జ‌రిగిన ఈవెంట్‌కి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, విజ‌య్ ఇద్ద‌రు వెళ్లారు. అక్క‌డ హోట‌ల్‌లో బ‌స చేశారు. పొద్దున్నే లేవ‌గానే విజ‌య్.. నాతో ఈ రోజు బెడ్‌ షేర్‌ చేసుకుంది ఎవరో చూడండి.. అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిప్పుతూ దుప్పటి లాగాడు విజయ్‌. నా ప‌క్క‌న ఉన్న‌ది ఎవ‌రు చూడండి అంటూ ఆనంద్ దుప్ప‌టి లాగుతాడు. విసుక్కుంటూ చూసిన ఆనంద్‌ కి విజ‌య్ చిరాకు తెప్పిస్తూ వీడియోలో క‌నిపించాడు.

ఆనంద్‌ వైపు కెమెరా చూపిస్తూ ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అంటూ అని అడుగుతూ ఆనంద్‌ను ఆటపట్టించాడు విజయ్‌. నిద్ర ముఖంతో ఉన్న ఆనంద్‌ కాస్తా విసుక్కుంటూ ‘నా పెళ్లాం లేచిపోయింది’ అంటూ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్‌ చేయడం లో భాగంగా ఈ వీడియో చేసిన‌ట్టు తెలుస్తోంది. న‌వంబర్ 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి