Manoj Desai : అప్పుడు విజ‌య్ ని తిట్టాడు.. ఇప్పుడు సారీ చెప్పాడు..? ఎందుక‌లా..?

August 30, 2022 2:52 PM

Manoj Desai : విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్పుడూ త‌న ప్ర‌వ‌ర్త‌నతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. అది దూకుడు స్వ‌భావంతో కానివ్వండి లేదా ప‌రిణ‌తి చెందిన వ్వ‌క్తిగా కానివ్వండి, ఏదైనా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఇప్పుడు ఈ విష‌యం మ‌రొకసారి రుజువైంది. అయితే ఇటీవ‌ల ముంబ‌యిలోని జీ7 అనే మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మాని అయిన‌ మ‌నోజ్ దేశాయ్ అనే అత‌ను లైగ‌ర్ సినిమా విడుద‌లపై కామెంట్ల విష‌యంలో విజ‌య్ ని తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. నీ వ‌ల్ల మా అడ్వాన్స్ బుకింగ్ క‌లెక్ష‌న్లు ప‌డిపోయాయి, నీకు బాగా పొగ‌రు, నీకు అంత త‌ల‌తిక్క ఉంటే నీ సినిమాల‌ను ఓటీటీలో మాత్ర‌మే విడుద‌ల చేసుకో అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు పెద్ద దుమారం రేపాయి.

అయితే ఆయ‌న ఇలా మాట్లాడిన వీడియో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ద్ద‌కు చేరింది. దీంతో న‌ష్ట నివార‌ణ చేయ‌ద‌ల‌చుకున్న విజ‌య్ నేరుగా ముంబై వెళ్లి ఆయ‌ను క‌ల‌వ‌డం జ‌రిగింది. అలా క‌లిసిన విజ‌య్ ఆయ‌న‌తో మాట్లాడుతూ.. అస‌లు త‌ను మీడియాతో మాట్లాడిన విష‌యం వేర‌ని కానీ దానిలో చిన్న ముక్క‌ను తీసుకొని ప్ర‌చారం చేయ‌డంతో అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని ఆ థియేట‌ర్ ఓన‌ర్ కి త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాల‌నుకున్న‌ట్టుగా అన్నాడు. ఇంకా త‌ను ఎప్ప‌డూ ప్రేక్ష‌కుల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌న‌ని, వారి వ‌ల్లే త‌ను ఈ స్థాయికి వ‌చ్చాన‌ని, వారంటే త‌న‌కు ఎంతో ప్రేమ‌, గౌర‌వం అని అన్నాడు. అలాగే మీలాంటి పెద్ద వ్య‌క్తుల ఆశీర్వాదం త‌న‌కు కావాల‌ని విజ‌య్ ఆ థియేట‌ర్ య‌జ‌మాని కాళ్ల‌కు మొక్కాడు.

Manoj Desai said Vijay Devarakonda is a good man
Manoj Desai

దీంతో ఆ థియేట‌ర్ య‌జ‌మాని కూడా విజ‌య్ ఇచ్చిన వివ‌ర‌ణ‌తో ఏకీభ‌వించాడు. ఇక ఆయ‌న మాట్లాడుతూ ఇందులో విజ‌య్ త‌ప్పు ఏమీ లేద‌ని అత‌ను చాలా మంచి వ్య‌క్తి అని, త‌న‌ది ఒదిగి ఉండే స్వ‌భావ‌మ‌ని, విన‌య విధేయ‌త‌లు గ‌ల మ‌నిషి అనీ, ఇక‌పై విజ‌య్ సినిమాల‌న్నీ త‌న థియేట‌ర్ లో విడుద‌ల చేస్తాన‌ని విజ‌య్ ని పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేసాడు. ఇంకా తాను ఎప్పుడూ ఎవ‌రికీ సారీ చెప్ప‌లేద‌నీ కానీ విజ‌య్ కి చెబుతున్నాని అన్నాడు. దీంతో విజ‌య్ త‌న‌ గొప్ప వ్య‌క్తిత్వాన్ని మ‌రొక‌సారి నిరూపించాడ‌ని, ఇంత‌టితో ఈ వివాదానికి తెర ప‌డింద‌ని సినీ వ‌ర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now