Tripuraneni Chittibabu : ఎన్‌టీఆర్‌ను చూసి నేర్చుకో.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చిట్టిబాబు చుర‌క‌లు..

September 3, 2022 10:46 AM

Tripuraneni Chittibabu : పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం భారీ అంచనాలతో గత నెల ఆగస్టు 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఊహలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రూ.120 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టం చవి చూపించింది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ రావటంతో సినీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాట తీరుపై సినీ ప్రముఖులు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత చిట్టి బాబు.. విజయ్ దేవరకొండ మాటతీరుపై స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్టార్ అనేవారు మీ పని ఎంతవరకు, మీ సినిమా విషయాలు ఏంటో అవి మాత్రమే మాట్లాడాలి. పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ను అందుకున్న విజయ్ దేవరకొండకి సినిమా ఫీల్డ్ లోకి ఎంటరైన‌ తరువాత చాలా ఫాస్ట్ గా అతనికి స్టార్ డమ్ అనేది వచ్చింది. స్టార్ డమ్ పెరగడంతో విజయ్ దేవరకొండకు నోరు కంట్రోల్ లేకుండా పోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా బ్యాలెన్స్‌డ్‌ గా మాట్లాడాలో తెలియకుండా డిసిప్లేన్ లేకుండా సినిమాల్లో మాదిరిగా ఒక రౌడీ మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు.

Tripuraneni Chittibabu comments on Vijay Devarakonda
Tripuraneni Chittibabu

ఒక హిట్ వచ్చినంత మాత్రాన మనం ఏది మాట్లాడితే అది చెల్లిపోతుంద‌ని అనుకోకూడదు. కెరియర్లో నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో. ఎంత పెద్ద హీరో అయినా కూడా పబ్లిక్ లో మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకరిని పరోక్షంగా విమర్శించడం కూడా చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఆటిట్యూడ్ చూపిస్తే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అంటూ నిర్మాత చిట్టి బాబు విజయ్ దేవరకొండపై ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా లైగర్ చిత్రం డిజాస్టర్ అవడం అనేది విజయ్ దేవరకొండకి ఒక గుణపాఠంగా భావిస్తున్నానని నేను అనుకుంటున్న అంటూ నిర్మాత చిట్టి బాబు వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now