Vijay Devarakonda : పూరీతో జ‌న‌గ‌ణ‌మ‌న మూవీ ఉందా.. లేదా.. చెప్పేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

September 13, 2022 9:24 AM

Vijay Devarakonda : సినిమా ఎంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ విజ‌యం సాధిస్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేరు. కానీ ఒక సినిమా విజ‌యం కంటే ప‌రాజ‌యమే ఒక న‌టుడికి జీవితంలో గుణ‌పాఠాలు నేర్పుతుందని చెబుతారు. ఒక చిత్ర ప‌రాజ‌యం దానిలో ప‌ని చేసిన వారందరిపై ప్ర‌భావం చూపుతుంది. కాగా హీరో విజ‌య్ దేవ‌రకొండ విష‌యంలో కూడా లైగ‌ర్ సినిమా ఫ్లాప్ అవ‌డం ఇదే విధంగా మార్పు తీసుకొచ్చింద‌నే అభిప్రాయం సినీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. లైగ‌ర్ తో పాన్ ఇండియా స్టార్ అవుదామ‌నుకున్న విజ‌య్ కి ఒక విధంగా ఈ సినిమా ప‌రాజ‌యం మేలు చేసింద‌నే అంటున్నారు.

లైగ‌ర్ ఘోరంగా విఫ‌లం అవ‌డంతో పూరీ జ‌గ‌న్నాథ్ తో త‌న త‌దుప‌రి సినిమా అయిన జ‌న గ‌ణ మ‌న గురించి మాట్లాడ‌టానికి విజ‌య్ దేవ‌ర కొండ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. చాలా ఏళ్లుగా జ‌న గ‌ణ మ‌న చిత్రం పూరీ క‌ల‌ల ప్రాజెక్ట్ గా ఉన్న విష‌యం ఇది వ‌ర‌కే తెలుసు. ఎంతో మంది హీరోల‌తో అనుకున్న‌ప్ప‌టికీ చాలా కాలం ఎదురుచూసిన త‌రువాత‌ చివ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండతో చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకోవ‌డం జ‌రిగింది.

Vijay Devarakonda given clarity on janaganamana movie
Vijay Devarakonda

అయితే ప్ర‌స్తుతం సైమా అవార్డ్స్ వేడుక‌ల్లో పాలుపంచుకుంటున్న విజ‌య్ ని ఈ సినిమా గురించి మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌డం జ‌రిగింది. దానికి ఆయ‌న స్పందిస్తూ.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంజాయ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్ల‌మ‌ని వారికి సూచించ‌డం జ‌రిగింది. దీంతో ఇక ఇప్ప‌ట్లో జ‌న గ‌ణ మ‌న సినిమా లేన‌ట్లేన‌ని భావిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ కూడా ఎవ‌రూ ఈ విష‌యంపై స్ప‌దించ‌క‌పోవ‌డంతో ఆ సినిమా ఆగిపోయింద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now