Vijay Devarakonda : ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తాం.. విజ‌య్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

October 25, 2021 8:04 AM

Vijay Devarakonda : ఆకాష్ పూరీ, కేతిక శర్మ జంటగా నటించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆయన మాట్లాడుతూ తన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. అలాగే లైగర్ సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ఉందని, లైగర్ రిలీజ్ కోసం పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయని విజయ్ అన్నారు. రొమాంటిక్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని.. ఈ సినిమాకి సునీల్ కశ్యప్ వండర్ ఫుల్ మ్యూజిక్ అందించారని అన్నారు.

Vijay Devarakonda comments on liger movie

అలాగే రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతిక శర్మ యాక్టింగ్ ఓ రేంజ్ లో చేసిందని, చాలా ఇంటిలిజెంట్ అంటూ తనకు హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ ఉందని అన్నారు. ఇక ఆకాష్ పూరీ గురించి స్పెషల్ గా చెప్పాలంటే అతనిలో యాక్టర్ అవ్వాలనే ఓ మంచి గోల్ ఉందని అది రీచ్ అవ్వడానికి తను చాలా కష్టపడుతున్నాడని అన్నారు. మీ నాన్న నిన్ను చూసి కాలర్ ఎత్తి గర్వపడేలా చేయాలని ఆకాష్ తో అన్నారు. ఆకాష్ కు సినిమాలంటే క్రేజ్ ఎక్కువ, ఇంతటి క్రేజ్ ఉన్నవాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు.

ఈ సినిమాతో ఆకాష్ పూరీ హిట్ కొడతాడని తనకు గట్టి నమ్మకం ఉన్నట్లు తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకి చార్మి, పూరీ జగన్నాథ్ లు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారని, వీరిద్దరంటే తనకు ఎంతో అభిమానం అని అన్నారు. అలాగే ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్న లైగర్ అభిమానులకు ఓ క్లారిటీ ఇస్తానంటూ.. లైగర్ సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తామని.. ఆ విషయంలో మీరు కూడా ఫిక్స్ అయిపోండని అన్నారు.

ఈ సినిమాలో ప్రతి విజువల్ ని ఎంతో చక్కగా, ప్లానింగ్ తో మనస్పూర్తిగా తీర్చిదిద్దామని అన్నారు. అలాగే ఈ సినిమా కోసం పూరీ జగన్నాథ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. తన రౌడీ బాయ్స్ కోసం ఓ బ్లాక్ బస్టర్ కమర్షియల్ లైగర్ వచ్చేస్తుందని విజయం దేవరకొండ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now