Vijay Devarakonda : అనుపమ ఇప్పుడు ఎంతో ఎదిగిపోయింది.. కామెంట్ చేసిన విజయ్ దేవరకొండ..!

October 21, 2021 3:57 PM

Vijay Devarakonda : సినిమా ఇండస్ట్రీలోకి అనుపమ పరమేశ్వరన్ ఎలా ఎంట్రీ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రేమమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె అందులో స్కూల్ కి వెళ్లే చిన్న పిల్ల పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ గురించి హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్ చేశారు.

Vijay Devarakonda comments on anupama parameshwaran

అనుపమ, ఆశిష్ జంటగా తెరకెక్కిన “రౌడీ బాయ్స్” చిత్రంలోని ప్రేమే ఆకాశం అనే పాటను విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అనుపమను చూస్తుంటే మేరీ పాత్రలో చిన్నపిల్లలా మాత్రమే ఉందని అనిపిస్తుంది కానీ ప్రస్తుతం ఆమె ఎదిగి పోయిందని తన గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

చరణ్ అన్న కూడా ఇదే విషయాన్ని అన్నారని అయితే ఇప్పటికీ మేమంతా చిన్నపిల్లల మాదిరిగానే అనిపిస్తుందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలియజేశారు. ఇక ఈ వేదికపై విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాను చేయబోతున్నామనే విషయాన్ని కూడా ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now