Venkatesh : చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నానంటూ వెంక‌టేష్ కామెంట్స్.. అభిమానులు షాక్..

November 20, 2021 8:36 AM

Venkatesh : సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. ఆయ‌న న‌టించిన సినిమాల‌కు మినిమం గ్యారెంటీ ఉంటుంది. రీసెంట్‌గా ‘నారప్ప’ సినిమాతో అలరించిన విక్టరీ వెంకటేష్.. నవంబ‌ర్ 25న‌ ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన వెంకటేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలపై ఓపెన్ అయ్యారు.

Venkatesh said he does not have any movies to do

వెంక‌టేష్ సినిమాలు ఇటీవ‌ల వ‌రుస‌గా ఓటీటీలో విడుద‌ల కావ‌డంపై స్పందించిన వెంకీ.. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోను. ఇది తప్పు, అది ఒప్పు అనేమీ ఉండదు. పరిస్థితులకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఇంకా థియేటర్‌కి రాని కుటుంబ ప్రేక్షకులు దీన్ని ఓటీటీ వేదికల ద్వారా చూడొచ్చనుకున్నాం. థియేటర్లలో విడుదల కాలేదని నా అభిమానులు బాధ పడుతుండొచ్చు కానీ.. భవిష్యత్తులో నా సినిమాలు థియేటర్లలోనే విడుదలవుతాయని అన్నారు.

ఇక త‌దుపరి సినిమాల గురించి మాట్లాడిన ఆయ‌న ప్రస్తుతానికైతే ఇంకా ఓకే చెప్పలేదు. కథలు వచ్చినప్పుడు చేద్దాం, లేనప్పుడు ఖాళీగా ఉందాం. ప్రపంచం తిరుగుదాం, ధ్యానం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. దానికంటే ఏం ఉంటుంది.. అని అన్నారు. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ప్రాజెక్టు ఒక దానిలో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం అని చెప్పుకొచ్చారు. కాగా వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోకి సినిమాలు లేవు.. అనే స‌రికి అంద‌రూ షాక్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now