Venkatesh : నానిని అన్ని మాట‌లు అన్న‌వాళ్లు.. ఇప్పుడు వెంకటేష్ విష‌యంలో సైలెంట్ అయ్యారేంటి ?

November 14, 2021 9:33 PM

Venkatesh : క‌రోనా త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మార్పులు వ‌చ్చాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే చాలా రోజుల పాటు థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. మోహ‌న్ లాల్, సూర్య‌, నాని, వెంక‌టేష్ వంటి వారు చేసేదేం లేక త‌మ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేశారు. అయితే నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్పుడు పెద్ద వివాదాలే న‌డిచాయి.

Venkatesh movie on ott why all theatre owners silent

నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని… నిజ జీవితంలో పిరికివాడు అంటూ నానిపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. ఇంత జ‌రిగిన కొన్ని రోజుల‌కు వెంక‌టేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన నార‌ప్ప ఓటీటీలో విడుద‌లైంది. ఆ స‌మ‌యంలో మాట్లాడేవారే క‌రువయ్యారు.

ఇక ఇప్పుడు వెంక‌టేష్ మ‌రో చిత్రం దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అవుతుంద‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. దాంతో సోషల్ మీడియాలో ,మీడియాలో ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. నానిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు దృశ్యం 2 ని థియేటర్ లలో రిలీజ్ చేయండ‌ని అడ‌గ‌డం లేదేంటి, సురేష్ బాబుకు భయపడి ఇలా సైలెంట్ అయ్యారా.. అని మరికొందరు క్వశ్చ‌న్ చేస్తున్నారు. థియ‌టర్స్ స‌జావుగా న‌డుస్తున్న స‌మ‌యంలోనూ దృశ్యం 2ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నా, ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now