Vava Suresh : 50వేల‌కు పైగా పాముల‌ను ప‌ట్టుకున్న ప్ర‌ముఖ స్నేక్ క్యాచ‌ర్‌.. తాచు పాము కాటుకు గుర‌య్యాడు.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

February 1, 2022 3:51 PM

Vava Suresh : కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ స్నేక్ క్యాచ‌ర్ వావా సురేష్ అంటే అంద‌రికీ పరిచ‌య‌మే. ఆయ‌న తాజాగా తాచు పాము కాటుకు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. కేర‌ళ‌లోని కొట్టాయంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Vava Suresh condition is very serious after he got cobra bite
Vava Suresh

కొట్టాయంలోని కురిచి గ్రామ పంచాయ‌తీలో ఓ ఇంటి స‌భ్యులు త‌మ ఇంటి ప‌శువుల షెడ్డులో ఓ తాచు పాము ఉంద‌ని సురేష్‌కు స‌మాచారం అందించారు. కాగా అక్క‌డికి చేరుకున్న సురేష్ ఎంతో చాక‌చ‌క్యంగా ఆ తాచు పామును పట్టుకుని సంచిలో వేసుకున్నాడు. అయితే చివ‌రి నిమిషంలో అత‌న్ని ఆ పాము కుడి తొడ‌పై కాటు వేసింది. అయిన‌ప్ప‌టికీ ఆ పామును సంచిలో వేసి మూట‌గా చుట్టి దాన్ని స‌మీపంలోని అడ‌విలో వ‌దిలేయ‌మ‌న్నాడు. అనంత‌రం సురేష్ అక్క‌డికి స‌మీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడు.

Vava Suresh : ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని..

ప్రైవేటు హాస్పిటల్‌లో సురేష్‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచారు. పాము విషానికి విరుగుడు ఇంజెక్ష‌న్ ఇచ్చారు. అయితే మెరుగైన వైద్యం కోసం అత‌న్ని కొట్టాయం మెడిక‌ల్ కాలేజ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ సురేష్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

అయితే వావా సురేష్ అక్క‌డ చాలా మందికి తెలిసిన కార‌ణంగా.. ఆయ‌న‌ను పాము కాటేసింద‌న్న విష‌యం తెలుసుకుని ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని చాలా మంది నెటిజ‌న్లు ప్రార్థిస్తున్నారు. ఆయ‌న ఇలా పాము కాటుకు గుర‌వ‌డంతో చాలా మంది విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక సురేష్ కు ప్ర‌ముఖ స్నేక్ క్యాచ‌ర్‌గా ఎంతో పేరుంది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 50వేల‌కు పైగా పాముల‌ను ప‌ట్టుకున్నాడు. అందులో 200 వ‌ర‌కు కింగ్ కోబ్రాలే ఉన్నాయి. ఆయ‌న త‌న వృత్తిలో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సార్లు పాము కాటుకు గుర‌య్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 300 సార్లు పాము కాటుకు గుర‌వ్వ‌గా.. అనేక హాస్పిట‌ల్స్ లో చికిత్స పొందారు. ఇక తాజాగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని అనేక మంది కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now