Vastu Tips : వాస్తు ప్రకారం మీ ఇంటి నంబరు ఇదైతే.. అదృష్టం మీ వెంటే..!

September 28, 2021 11:55 PM

Vastu Tips : సాధారణంగా కొందరు న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇలా వారు చేసే పనిలో తమ అదృష్ట సంఖ్య వచ్చే విధంగా పనులు ప్రారంభించడం లేదా వారు కొనుగోలు చేసిన వాహనాలకు లేదా ఇంటికి అదే నంబర్ తీసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటిని నిర్మించేటప్పుడు చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు.

Vastu Tips : వాస్తు ప్రకారం మీ ఇంటి నంబరు ఇదైతే.. అదృష్టం మీ వెంటే..!
Vastu Tips

జీవితాంతం నివసించే ఇంటిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో ఆ ఇల్లు మనకి కలిసి వస్తుందా, లేదా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ విధమైనటువంటి సందేహాలను వ్యక్తపరిచే వారు ఆ ఇంటి నంబరు ఆధారంగా అది అదృష్టమా, లేదా.. అన్న సంగతి తెలుసుకోవచ్చు.

న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీతో ఇంటిని ఎంపిక చేసుకోవడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు మీరు పుట్టిన తేదీలను కలిపి కూడితే వచ్చే నంబర్ ఆధారంగా చేసుకుని ఇంటిని కొనుగోలు చేయాలి. ఉదాహరణకు మీరు 27.07.2000 లో జన్మించారు అనుకోండి అప్పుడు అన్ని అంకెలను కూడితే 18 వస్తుంది. మళ్లీ ఈ రెండు అంకెలను కూడాలి. 9 వస్తుంది. అంటే మీ లక్కీ నంబర్‌ 9 అని అర్థం.

కనుక ఈ నంబర్ ఆధారంగా ఇంటిని కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఇలా మన పుట్టిన తేదీని ఆధారం చేసుకుని ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు లోపాలు, లోటుపాట్లు ఉండవని చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now