Varun Doctor : ఓటీటీలో వరుణ్ డాక్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

October 28, 2021 3:29 PM

Varun Doctor : కరోనా రెండవ దశ తర్వాత థియేటర్లలో పలు సినిమాలు విడుదల అవుతూ ఎన్నో సినిమాలకు ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తమిళంలో డాక్టర్ అనే సినిమా థియేటర్ లలో విడుదలై అద్భుతమైన టాక్ ను సంపాదించుకుంది. తమిళంలో డాక్టర్ సినిమా తెలుగులో వరుణ్ డాక్టర్ అనే పేరుతో డబ్ అయి థియేటర్లలో విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.

Varun Doctor to stream on netflix from november 5th

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ సినిమా బిజినెస్ చేయగా.. సుమారుగా కోటి రూపాయల వరకు లాభాలు వచ్చాయని సమాచారం వినబడుతోంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇక థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన అభిమానులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ శుభవార్త చెప్పింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుణ్ డాక్టర్ అనే సినిమా నవంబర్ 5వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా నవంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now