Varsha : ఇమ్మాన్యుయెల్ ఫ్రెండ్ కాదు.. అంత‌కు మించి.. అంటున్న వ‌ర్ష‌.. ఏంటి క‌థ‌..?

June 12, 2022 8:00 AM

Varsha : బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ షో ఎన్నో ఏళ్ల నుంచి విజ‌య‌వంతంగా కొన‌సాగుతూ వ‌స్తోంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో దీన్నుంచి కొంద‌రు స్టార్ క‌మెడియ‌న్లు దూర‌మ‌య్యారు. దీంతో ఈ షో ఎలా కొన‌సాగుతుందా.. రేటింగ్స్‌.. వ‌స్తాయా.. లేదా.. అని సందేహాలు నెల‌కొన్నాయి. అయితే ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. ఈ షోలో ర‌ష్మి, సుధీర్ జంట‌కు వ‌చ్చిన పేరు అంతా ఇంతా కాదు. వీరు స్కిట్ చేస్తే ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తారు. అయితే వీరు మాత్ర‌మే కాకుండా.. వ‌ర్ష‌, ఇమ్మాన్యుయెల్ జంట‌కు కూడా అలాంటి పేరే వ‌చ్చింది.

ర‌ష్మి, సుధీర్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌ను ఎంతో కాలం నుంచి న‌డిపిస్తున్నారు. అయితే అది కేవ‌లం షో కోసం మాత్ర‌మే. కానీ నిజంగానే వీరి మ‌ధ్య ఏదో ఉంద‌ని.. అప్పుడ‌ప్పుడు వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే తాము ల‌వ్ ట్రాక్ న‌డిపేది కేవ‌లం షో కోసం మాత్ర‌మేన‌ని వారు ఇది వ‌ర‌కు స్ప‌ష్టం చేశారు. ఇక ఇప్పుడు వ‌ర్ష‌, ఇమ్మాన్యుయెల్ కూడా ఇలాగే చెప్పాల్సి వ‌స్తోంది. అయితే ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌ర్ష‌.. ఇమ్మాన్యుయెల్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. తాను ఫ్రెండ్ క‌న్నా ఎక్కువ‌ని చెప్పింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Varsha comments on Emmanuel about their friendship
Varsha

ఇమ్మాన్యుయెల్ గురించి వ‌ర్ష మాట్లాడుతూ.. అత‌ను కేవ‌లం నా ఫ్రెండ్ అని చెప్పలేం. అంతక‌న్నా ఎక్కువే. అస‌లు మా మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్ ఏమిటో అర్థం కావ‌డం లేదు. మా మ‌ధ్య ఏదో తెలియ‌ని బంధం ఉంది. అయితే అది భ‌విష్య‌త్తులో నిజం కావ‌చ్చు. ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు. మేం ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం.. అని వ‌ర్ష కామెంట్స్ చేసింది. దీంతో వ‌ర్ష ఎందుకు ఇలా మాట్లాడింది.. అని అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఇది కూడా ఏదైనా షో కోస‌మేనా.. అని సందేహాలు వ‌స్తున్నాయి. గ‌తంలోనూ ఇలాగే చేశారు కాబ‌ట్టి.. వ‌ర్ష మాట్లాడింది న‌మ్మ‌లేమ‌ని అంటున్నారు.

ఇక ప‌టాస్ షోలో స‌క్సెస్ అయిన ఇమ్మాన్యుయెల్‌కు జ‌బ‌ర్ద‌స్త్‌లో ఆఫ‌ర్ వ‌చ్చింది. దీంతో అందులో అత‌ను కొన‌సాగుతున్నాడు. ఇక హైప‌ర్ ఆది టీమ్‌లో ముందుగా స్కిట్స్ చేసిన వ‌ర్ష ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌తో క‌లిసి స్కిట్స్ చేస్తోంది. ఇక వ‌ర్ష రానున్న బిగ్ బాస్ తెలుగు 6 షోలోనూ పాల్గొన‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now