Vantalakka : రాజ‌మౌళి ఆఫ‌ర్‌కు వంట‌ల‌క్క నో చెప్పిందా ? ఎందుకు ?

May 1, 2022 3:21 PM

Vantalakka : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న తెర‌కెక్కించిన బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాని హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తూ అద్భుతాలు సృష్టిస్తుండ‌గా, ఆయ‌న సినిమాల‌లో న‌టించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నారు. కానీ వంట‌ల‌క్కగా కార్తీక దీపం సీరియల్‌లో అల‌రిస్తున్న ప్రేమి విశ్వ‌నాథ్ మాత్రం రాజ‌మౌళి ఆఫ‌ర్‌ని సింపుల్‌గా తిరస్క‌రించింద‌ట‌. అందుకు కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vantalakka or Premi Vishwanath told no to Rajamouli
Vantalakka

కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. వంట‌ల‌క్క‌గా ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకున్న ప్రేమి.. ఆర్ఆర్ఆర్ లో మల్లి అనే పాపకు తల్లిగా నటించాల్సి ఉంది. ఆ సమయంలో వంటలక్క రాజమౌళి అడిగిన కాల్షీట్లు ఆమె అడ్జెస్ట్ చేయలేక ఏకంగా నో చెప్పేసిందట. ఆ పాత్రకు అహ్మరిన్ అంజుం అనే నటిని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో ఈమెకు రెండే సీన్లు ఉంటాయి. సినిమా ప్రారంభంలో అలా క‌నిపించి చివ‌ర‌లో మెరుస్తుంది.

కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించినా కూడా ర‌న్‌టైం ఎక్కువ కావ‌డంతో తొలగించారు. ఫేమ‌స్ సీరియ‌ల్ అయిన కార్తీక దీపంలో ప్రేమి ఫుల్ మేకప్‌తో కనిపించదు. ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోదు. నలుపు ఛాయతో చూడడానికి మామూలు అమ్మాయిలాగా ఉంటుంది. కానీ తన ఆత్మవిశ్వాసమే తన బలం. ఇలాంటి ఒక అమ్మాయిని హీరోయిన్ అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానంతోనే కార్తీక దీపం సీరియల్ మొదలైంది. కార్తీక దీపం సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ దక్కాల్సింది అందులోని హీరోయిన్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now