Vaishnav Tej: సాయి తేజ్ ఆరోగ్యంపై స్పందించిన వైష్ణవ్ తేజ్.. డిశ్చార్జ్ అయ్యేది అప్పుడే ?

October 3, 2021 2:39 PM

Vaishnav Tej : గత నెల సెప్టెంబర్ 10వ తేదీన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి తేజ్ కి కాలర్ బోన్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా ఆయన ఇప్పటికీ హాస్పిటల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే సాయి తేజ్ ఆరోగ్యం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండడంపై ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Vaishnav Tej: సాయి తేజ్ ఆరోగ్యంపై స్పందించిన వైష్ణవ్ తేజ్.. డిశ్చార్జ్ అయ్యేది అప్పుడే ?

సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను కర్నూల్ లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్.. సాయి తేజ్ ఆరోగ్యంపై స్పందించారు.

ఈ సందర్భంగా సాయి తేజ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం వైద్యుల తనకి ఫిజియోథెరపీ చేయిస్తున్నారని.. మరో వారం రోజులలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా వైష్ణవ్ తెలియజేశారు.

అయితే సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన విడుదల కాగా, వైష్ణవ్ తేజ్ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now