Hair Fall : ఈ విత్త‌నాల‌తో నూనెను ఇలా చేసి జుట్టుకు రాస్తే.. జుట్టు అస‌లు రాల‌దు.. ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

November 25, 2022 7:58 AM

Hair Fall : కలోంజి లేదా నిగెల్లా విత్తనాలు భారతీయ వంటశాలలలో కనిపించే ఒక సాధారణ పదార్ధం. ఈ చిన్న నల్ల గింజలను సాధారణంగా టెంపరింగ్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే అవి మీ జుట్టుకు అద్భుతాలు చేయగలవని మీకు తెలుసా? మార్కెట్‌లో లభించే చాలా హెయిర్ మాస్క్‌లు మరియు కండిషనర్ల తయారీలో కలోంజి విత్తనాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి మీ జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలను అందజేస్తాయి.

ఇవి స్కాల్ప్ లో చికాకును తగ్గిస్తాయి. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ చుండ్రు మరియు ఇతర జుట్టు సమస్యలకు దారితీస్తుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. పోషకాలతో నిండిన కలోంజీ మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి మీ జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ఇది మీ జుట్టు పెరుగుదలకు సహాయపడడమే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

use these seeds in this method to prevent Hair Fall
Hair Fall

కలోంజి ఆయిల్‌లో ఉండే లినోలెయిక్ యాసిడ్ జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. కలోంజి ఆయిల్‌లో ఒమేగా 3 సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఇంట్లో కలోంజి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ నూనెకు కావలసినవి 1 టేబుల్ స్పూన్ కలోంజిలో విత్తనాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొబ్బరి నూనె 200 ml, 50 ml ఆముదం అవసరం. ముందుగా కలోంజి గింజలు మరియు మెంతులను మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని గాజు పాత్రలో వేయాలి. దానిలో కొబ్బరినూనె, ఆముదం వేసి బాగా కలపాలి. ఇప్పుడు కంటైనర్‌ను మూసివేసి సూర్యకాంతిలో ఉంచండి. 2 నుండి 3 వారాల పాటు అలానే సూర్యకాంతిలో ఉంచాలి. ప్రతి రెండు రోజులకొకసారి నూనెను కలుపుతూ ఉండాలి. 2-3 వారాల తర్వాత ఈ నూనెను వడకట్టండి. మంచి ఫలితాల కోసం ఈ నూనెను వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టుకి అప్లై చేసి నెమ్మదిగా చేతివేళ్లతో  5 నిముషాలు పాటు చేతి వేళ్ళతో  మసాజ్  చేసుకోవాలి . ఇలా చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now