Urfi Javed : మ‌రో సారి బోల్డ్ అవ‌తారంలో ఉర్ఫి జావేద్.. తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్..

November 24, 2021 8:19 AM

Urfi Javed : బాలీవుడ్ న‌టి, బిగ్ బాస్ కంటెంట్ ఉర్ఫి జావేద్ నిత్యం త‌న గ్లామ‌ర్ షోతో వార్త‌ల‌లోకి ఎక్కుతూ ఉంటుంది. 2016లో టీవీ కార్యక్రమం ‘బడే భయ్యా కీ దుల్హానియా’తో ఉర్ఫి నటిగా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ‘మేరీ దుర్గ’, ‘పంచ్‌ బీట్ సీజన్‌’ తదితర సిరీస్‌లతో సందడి చేసింది. ఈ ఏడాది ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, 8వ రోజునే బయటకి వచ్చేసింది.

Urfi Javed yet again in news netizen troll her

ఈ అమ్మ‌డు ఎప్పుడూ త‌న గ్లామ‌ర్ షోతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా హాట్ షో చేస్తూనే ఉంటుంది. క్యూట్ క్యూట్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా క‌నిపిస్తూ మ‌తులు పోగొడుతుంది. ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోయ‌డాన్ని నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని తిట్లు తిట్టినా కూడా తాను అనుకున్న‌దే చేస్తోంది ఉర్ఫి.

ఆ మధ్య ఓ మహిళా నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ ఉర్ఫి జావేద్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌ మొదట్లో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

‘మాది సంప్రదాయమైన మధ్యతరగతి కుటుంబం. నాకు నటి అవ్వాలనే ఆశ ఉండేది. వెబ్‌ సిరీస్‌ నిర్మాత ఓ మహిళ. సెట్‌ అందరి ముందు ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది. షూట్‌ ప్రారంభించగానే నా దుస్తులు తొలగించాలని చెప్పింది. దీంతో నేను ఎందుకు అని ప్రశ్నించాను. వినకుండా బలవంతంగా నా ఒంటిపై దుస్తులను చింపేసిందని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment