Upasana : రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్ లో పేపర్లు విసురుతూ.. ఎంజాయ్ చేసిన‌ ఉపాసన!

March 25, 2022 11:19 AM

Upasana : మూడు సంవత్సరాల నుంచి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన RRR సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు థియేటర్ల బాట పట్టి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు.

Upasana thrown papers in theatres upon Ram Charan entry scene
Upasana

ఈ సినిమాని చూడటం కోసం ఉపాసన థియేటర్ కి వెళ్లి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్దగా కేకలు వేస్తూ పేపర్లు చింపి గాల్లోకి విసిరారు. అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన నాటు నాటు పాట రాగానే ఎంతో సంతోషంతో పేపర్లు చింపి గాల్లోకి విసురుతూ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ఇక మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని వీక్షిస్తూ సినిమా సూపర్ హిట్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now