Unstoppable With NBK : బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ పరిస్థితి ఏంటి.. రెండు వారాల‌కే ముగిసిందా ?

November 25, 2021 2:51 PM

Unstoppable With NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆహా డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బాలకృష్ణతో అల్టిమేట్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించారు. ఈ ప్రోగ్రామ్ కోసం బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో వెయిట్ చేశారు. ఈ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ వచ్చి అలరించింది. నెక్ట్స్ ఎపిసోడ్ కి నాని ని ఇన్వైట్ చేశారు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్ లు కూడా పార్టిసిపేట్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

Unstoppable With NBK what about the program it will continue or not

అయితే నాని ఎపిసోడ్ తర్వాత ఇంతవరకు అన్ స్టాపబుల్ నుండి ఎలాంటి ప్రోమోగానీ, టాక్ గానీ వినిపించకపోవడం గమనార్హం. అసలు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి ఏమైంది.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య చేతికి సర్జీరీ జరగడంతోనే ఈ ప్రోగ్రామ్ స్ట్రీమింగ్ అవ్వడం లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలాగే ఈ ప్రోగ్రామ్ ని టెంపరరీగా ఆపారా.. లేదా పూర్తిగా ఆపేశారా.. అనే క్రమంలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ షోకి ఫస్ట్ లో మినిమం 12 ఎపిసోడ్స్ అయినా ఉంటాయనే క్రమంలో బాలకృష్ణకు 6 కోట్ల రూపాయల్ని రెమ్యునరేషన్ అందించింది అంటూ నెట్టింట్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన క్రేజ్ తో అఖండ సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నారు. మరి ఇలాంటి క్రమంలో అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ ఎందుకు ఆగిపోయింది.. అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో అటు ఆహా టీమ్ గానీ, బాలకృష్ణ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now