Unstoppable With NBK : ఓటీటీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాలయ్య..!

December 1, 2021 2:45 PM

Unstoppable With NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ వెండి తెరపై హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై స్టార్ డమ్ సంపాదించుకున్న బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ కార్యక్రమం గురించి ఎంతగానో ఎదురుచూశారు. బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ఈ టాక్ షోను ఎలా నడిపిస్తారోన‌ని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

Unstoppable With NBK : ఓటీటీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాలయ్య..!

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు మొదటి అతిథిగా రావడంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆహాకు స‌బ్‌స్క్రైబ‌ర్లు కూడా పెరిగి పోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం అద్భుతమైన రికార్డులను సృష్టించిందని చెప్పవచ్చు.

ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లో ఏకంగా 4 మిలియన్లకు పైగా లైక్‌లతో ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు 4 మిలియన్ లకు పైగా లైక్ లు, వ్యూస్‌తో టాప్ ప్లేస్ లో ఈ కార్యక్రమం నిలవడం గమనార్హం. అయితే ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమం కేవలం రెండు ఎపిసోడ్ లు మాత్రమే ప్రసారమైంది. బాలకృష్ణ చేతికి గాయం కావడం వల్ల కొన్ని వారాల పాటు వాయిదా పడింది. అయితే తిరిగి ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రోమోని వదిలారు. త్వ‌ర‌లో రానున్న ఎపిసోడ్‌లో బ్ర‌హ్మానందం సంద‌డి చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now