Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ ప్రోమోలో అదిరిపోయే పంచ్‌లు.. మోహ‌న్ బాబు ప్ర‌శ్న‌ల‌కు బాల‌య్య నోట స‌మాధానం లేదు..

October 31, 2021 3:34 PM

Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ ను న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. మొన్నటి వ‌ర‌కు తొలి ఎపిసోడ్ గెస్ట్ ఎవ‌రా అని అంద‌రిలోనూ అనుమానాలు ఉండేవి. తాజాగా ప్రోమోతో పూర్తి క్లారిటీ ఇచ్చారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వ‌గా, ఇద్ద‌రి మ‌ధ్యా ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడిచింది.

Unstoppable With NBK balakrishna stunned for mohanbabu questions

తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు ? అని మోహన్ బాబు అడగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎవరో ఫిటింగులు పెడుతుంటారు అంటూ చెప్ప‌డం, అరవిందే.. నన్ను ఈ ప్రశ్న అడగమని చెప్పి ఉంటారు ? అని మోహ‌న్ బాబు అన‌డం చూస్తుంటే షో ర‌స‌వత్త‌రంగా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

షో ఆరంభంలో మోహ‌న్ బాబు రాగా, ఆ త‌ర్వాత మంచు ల‌క్ష్మీ, మంచు విష్ణు అడుగుపెట్టారు. మంచు లక్ష్మీ.. బాల‌య్య‌తో డ్యాన్స్ చేయ‌డం స్పెష‌ల్ హైలైట్ అనే చెప్పాలి. సాధారణంగా మోహన్ బాబు టాక్ షో ల్లో ఎక్కువగా కనిపించరు. ఆ మధ్య అలీ టాక్ షో లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందనే నమ్మకాన్ని ఆహా వారు వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now