Unstoppable With NBK : బాలయ్య షో 2వ ఎపిసోడ్‌.. గెస్ట్‌గా నాని.. ప్రోమో అదిరింది..!

November 8, 2021 7:15 PM

Unstoppable With NBK : వెండితెర‌పై ఆహా అనిపించిన బాల‌కృష్ణ ఇప్పుడు డిజిట‌ల్ ప్లాట్‌ఫాంపై ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో టాక్ షో మొద‌లు కాగా, తొలి ఎపిసోడ్ లో బాలయ్య.. మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబును నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నారు. సినిమాలు, రాజ‌కీయాల‌తోపాటు ప‌లు అంశాలు ఈ ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

Unstoppable With NBK aha launched 2nd episode promo

ఇక రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురు పేర్లు వినిపించగా రెండో ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా రాబోతున్నట్లుగా ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. జై బాలయ్య అనే పేరును ఆయన ఆ సినిమాలో పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. అయితే రెండో ఎపిసోడ్‌లో నాని సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను లాంచ్‌ చేశారు.

ప్రోమోలో చాలా ఫన్నీ అయిన సీన్స్‌ను ఇద్దరి మధ్యా చూడవచ్చు. ప్రోమో చూస్తుంటే రెండో ఎపిసోడ్‌ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రికెట్‌ గురించిన ప్రస్తావన రావడంతోపాటు నాని తన సినీ కెరీర్‌కు చెందిన ముఖ్యమైన విషయాలను తెలిపాడు. దీంతో ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని తెలుస్తోంది.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంపై హోప్స్ పెట్టుకున్నాడు. డిసెంబ‌ర్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now