Unstoppable Show : బుల్లితెరపై ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు యాంకర్లుగా మారి పలు షోలను హోస్ట్ చేశారు. వారిలో చాలా మంది ఆ విధంగా విజయం సాధించారు. ఇక అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఘన విజయం సాధించింది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం అయిన ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఈ షో ద్వారా బాలయ్యలోని మరో యాంగిల్ బయటకు వచ్చింది. ఆయన ఎంత సరదాగా ఉంటారో తెలిసిపోయింది. అయితే మొదటి సీజన్ చాలా ఆసక్తికరంగా సాగగా.. త్వరలోనే రెండో సీజన్‌ను ప్రసారం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సక్సెస్ అవడంతో నిర్వాహకులు ఇప్పుడు ఈ షో రెండో సీజన్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉండాలి.. ఏయే ఎపిసోడ్స్‌కు ఎవరెవరిని పిలవాలి.. అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి సీజన్‌లో పలువురు ప్రముఖ నటీనటులు ఈ షోకు హాజరవ్వగా.. ఇప్పుడు కొందరు స్టార్ హీరోలను ఈ సీజన్‌లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక అన్‌స్టాపబుల్ షో రెండో సీజన్‌కు గాను వచ్చే గెస్ట్‌లను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్స్ ఉన్నారని సమాచారం. వీరిని ఎలాగైనా సరే ఈ సారి సీజన్‌లో ఎపిసోడ్స్‌కు తీసుకురావాలని నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…