Unstoppable Show : అన్‌స్టాప‌బుల్ షో సీజ‌న్ 2 రెడీ.. గెస్టులు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

April 30, 2022 9:38 PM

Unstoppable Show : బుల్లితెర‌పై ఇప్ప‌టికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు యాంక‌ర్లుగా మారి ప‌లు షోల‌ను హోస్ట్ చేశారు. వారిలో చాలా మంది ఆ విధంగా విజ‌యం సాధించారు. ఇక అలాంటి న‌టుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. ఈయన వ్యాఖ్యాత‌గా చేసిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ఘ‌న విజ‌యం సాధించింది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌సారం అయిన ఈ షో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ షో ద్వారా బాలయ్య‌లోని మ‌రో యాంగిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయన ఎంత స‌ర‌దాగా ఉంటారో తెలిసిపోయింది. అయితే మొద‌టి సీజ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగ‌గా.. త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్‌ను ప్ర‌సారం చేసేందుకు నిర్వాహ‌కులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Unstoppable Show season 2 guests list will surprise you
Unstoppable Show

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే స‌క్సెస్ అవ‌డంతో నిర్వాహ‌కులు ఇప్పుడు ఈ షో రెండో సీజ‌న్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సీజ‌న్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉండాలి.. ఏయే ఎపిసోడ్స్‌కు ఎవ‌రెవ‌రిని పిల‌వాలి.. అని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మొద‌టి సీజ‌న్‌లో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈ షోకు హాజ‌ర‌వ్వ‌గా.. ఇప్పుడు కొంద‌రు స్టార్ హీరోల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇక అన్‌స్టాప‌బుల్ షో రెండో సీజ‌న్‌కు గాను వ‌చ్చే గెస్ట్‌ల‌ను ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారిలో చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, ప్ర‌భాస్ వంటి స్టార్స్ ఉన్నార‌ని స‌మాచారం. వీరిని ఎలాగైనా స‌రే ఈ సారి సీజ‌న్‌లో ఎపిసోడ్స్‌కు తీసుకురావాల‌ని నిర్వాహ‌కులు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి వారి ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now