Unstoppable 2 : అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ప్రోమో.. షోకి వచ్చి బాల‌య్య సంసారంలో నిప్పులు పోసిన చంద్రబాబు, లోకేష్..!

October 11, 2022 9:32 PM

Unstoppable 2 : బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తొలి అడుగు వేశాడు నందమూరి బాలకృష్ణ. ఆహాలో అన్ స్టాబబుల్ అంటూ ఓ టాక్ షో లో హోస్ట్ గా చేశారు. అగ్ర హీరోలంద‌రూ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సీజ‌న్ 1 షో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సీజన్ 2 ఎప్పుడా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. సీజ‌న్ 1 కంటే సీజ‌న్ 2ను ఇంకా గొప్ప‌గా ఉండేలా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ ప్రోమో వ‌చ్చేసింది.

ప్రోమోలో ఆద్యంతం చంద్రబాబు, బాల‌య్య‌, లోకేష్ మ‌ధ్య సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగింది. చంద్ర‌బాబుకు ముందు బాల‌య్య ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతూ స్టేజ్ మీద‌కు ఆహ్వానించారు. ఎన్టీఆర్ గురించి చెపుతూ నా లైఫ్‌లో ఆయ‌న ఒక ఆరాధ్య దైవం.. ఆయ‌న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు అని చంద్ర‌బాబు చెప్పారు. అలాగే త‌న కెరీర్‌లో తీసుకున్న బిగ్ డెసిష‌న్ల‌లో 1995 ఆగ‌స్టు సంక్షోభంగా చంద్ర‌బాబు చెప్పారు.

Unstoppable 2 Balakrishna first episode promo viral
Unstoppable 2

ఇక లోకేష్ స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిల‌తో జ‌ల‌కాలాట‌లు ఫొటో చూపిస్తూ ఇది అసెంబ్లీ దాకా వెళ్లింద‌య్యా.. అంటూ చ‌మ‌త్క‌రించారు. బాబు, లోకేష్ క‌లిసి బాల‌య్యను ఆడుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. తండ్రి, కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి నా సంసారంలో నిప్పులు పోస్తారా..? అని బాల‌య్య న‌వ్వుతూ అనేశారు. ఏదేమైనా ప్రోమోతోనే బాల‌య్య దుమ్ము లేపేశాడు. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఎపిసోడ్లో ఇంకెన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి..

https://youtu.be/jGMH_luXetg

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now