Unemployment Rate : నిరుద్యోగ రేటు తెలంగాణ‌లో చాలా త‌క్కువ‌.. ఏపీలో ఎంత‌.. ఆస‌క్తిక‌ర నివేదిక‌..!

February 3, 2022 2:48 PM

Unemployment Rate : క‌రోనా నేప‌థ్యంలో గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో దేశంలో చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయిన విష‌యం విదిత‌మే. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మలు చాలా వ‌ర‌కు మూత ప‌డ‌డంతో చాలా మంది ఉపాధిని సైతం కోల్పోయారు. అయితే తాజాగా వెల్ల‌డించిన ఓ నివేదిక ప్ర‌కారం.. దేశంలో తెలంగాణ‌లోనే నిరుద్యోగ రేటు అత్యంత త‌క్కువ‌గా ఉంద‌ని వెల్ల‌డైంది.

Unemployment Rate is very low in Telangana
Unemployment Rate

ఇండిపెండెంట్ థింక్‌-ట్యాంక్ సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ విడుద‌ల చేసిన జాబితా ప్రకారం.. దేశంలో నిరుద్యోగ రేటు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో హ‌ర్యానా మొద‌టి స్థానంలో ఉంది. అక్క‌డ నిరుద్యోగ రేటు ఏకంగా 23.4 శాతం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ జాబితాలో తెలంగాణ చిట్ట చివ‌రి స్థానంలో ఉంది. రాష్ట్రంలో కేవ‌లం 0.7 శాతం మాత్ర‌మే నిరుద్యోగ రేటు ఉండ‌డం విశేషం.

ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిరుద్యోగ రేటు 6.2 శాతంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఈ జాబితాలో రాజ‌స్థాన్ 18.9 శాతంతో రెండో స్థానంలో ఉండ‌గా.. త్రిపుర 17.1 శాతంతో మూడో స్థానంలో ఉంది.

క‌రోనా కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి దేశంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయిన‌ప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నిరుద్యోగ రేటు త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే తాజాగా వెల్ల‌డించిన నివేదిక అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now