Under 19 Cricket World Cup : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌.. సెమీ ఫైన‌ల్‌లోకి భార‌త్ ప్ర‌వేశం.. వ‌రుస‌గా ఇది 4వ సారి..!

January 30, 2022 1:00 PM

Under 19 Cricket World Cup : ఐసీసీ అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీల్లో భార‌త్ ప్ర‌తిసారి త‌న స‌త్తా చాటుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రుగుతున్న అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 టోర్నీలో సెమీ ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించింది. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా పేరున్న బంగ్లాదేశ్‌ను క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఓడించిన భార‌త్ సెమీ ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించింది. కాగా అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీల్లో భార‌త్ సెమీ ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించ‌డం వ‌రుస‌గా ఇది నాలుగ‌వ సారి కావ‌డం విశేషం.

Under 19 Cricket World Cup india into semi finals

ఈ సారి జ‌రుగుతున్న టోర్నీలో గ్రూప్‌లో భార‌త్‌, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌, ఉగాండాలు పోటీ ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్ సౌతాఫ్రికాను 45 ప‌రుగుల తేడాతో ఓడించింది. అలాగే ఐర్లాండ్‌పై 174 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఉగాండాపై ఏకంగా 326 ప‌రుగుల రికార్డు తేడాతో భార‌త్ గెలుపొందింది. ఇక తాజాగా శ‌నివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ప్ర‌స్తుతం భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టుకు ధుల్ కెప్టెన్సీ వ‌హిస్తున్నాడు. షేక్ ర‌షీద్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే భార‌త్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్ మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 5న నిర్వ‌హిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now