Uday Kiran : అవమానాలు, చీత్కారాలు.. తక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చి మోసగిస్తూ ఉదయ్‌ కిరణ్‌ ను తొక్కి పడేశారు..?

October 23, 2021 10:13 AM

Uday Kiran : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. లవ్ స్టోరీ కథల్ని తెరకెక్కిస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ని అందుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన మరణ వార్త టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతోపాటు ఆయన అభిమానుల్ని కూడా కలచివేసింది. నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా కొనసాగారు.

Uday Kiran was cheated and insulted by cine industry people

అయితే అదే టైమ్ లో ఆయనకు ఇండస్ట్రీ నుండే మరెన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సూసైడ్ కి అసలు కారణం ఏంటనేది కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కొంతమంది సినీ స్టార్స్ కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉదయ్ కిరణ్ స్టార్ డమ్ చూసి తట్టుకోలేక ఆయనకు వచ్చే అవకాశాల్ని లేకుండా చేయడమే కాకుండా తనను అతి దారుణంగా అవమానించేలా పలు రకాల సమస్యల్ని క్రియేట్ చేశారని.. వాటిని తట్టుకోలేక ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

తేజ డైరెక్షన్ లో చిత్రం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కాన్ఫిడెంట్ గా నటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీ వ్యక్తులు ఉదయ్ కిరణ్ ను అవమానించారని తెలుస్తోంది. అలాగే తనతో సినిమా చేయాలంటే రూ.25 లక్షల వరకు రెమ్యూనరేషన్ మాట్లాడుకుని సినిమా పూర్తి అయ్యేసరికి రూ.5 లక్షలు ఇచ్చి అవమానించేవారని సన్నిహితులు గతంలో వెల్లడించారు. అందుకే ఆయన కెరీర్ ను కూడా ఎదగనివ్వకుండా చేశారని పలువురు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ సాధించిన నటుడు ఉదయ్ కిరణ్. జీవితం, కెరీర్ ఎంతో అందంగా ఉందనుకునేలోపే తన ఆత్మహత్యతో జీవితాన్ని ముగించారు ఉదయ్ కిరణ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now