Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ చనిపోవడానికి ముందు న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

Uday Kiran : చాలా త‌క్కువ స‌మయంలోనే సినిమా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన హీరోల‌లో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌రు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అప్ప‌ట్లోనే ఉద‌య్ అగ్ర హీరోల‌కు దీటుగా ఎద‌గ‌డం ప్రారంభించాడు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా డేట్స్ కోసం ఎద‌రు చూసే స్థాయికి ఉద‌య్ కిర‌ణ్ చేరుకున్నాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉదయ్ కిరణ్ సహజమైన నటనతో ఇండస్ట్రీలో హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల సినిమా అవ‌కాశాలు తగ్గటం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే విషితను వివాహం చేసుకోవడం, అక్క‌డ కూడా స‌మస్య‌లు ఎదుర‌వ‌డం వ‌ల్ల డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఉద‌య్ కిర‌ణ్ కు సినీ పరిశ్రమలో ఉన్న స్నేహితుల్లో హీరో అల్లరి న‌రేష్ కూడా ఒక‌రు. న‌రేష్, ఉద‌య్ కిర‌ణ్ గురించి ఓ ఇంట‌ర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Uday Kiran

ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయే ముందు హీరో న‌రేష్ ఆయ‌న‌ను కలవటం జరిగిందట. ఆ సమయంలో ఉద‌య్ కిర‌ణ్ ముఖంలో దిగులు, బాధ కనిపించాయట. దాంతో ఎందుకు ఉద‌య్ అలా డ‌ల్ గా ఉన్నావు అని ప్రశ్నించాను అని నరేష్ తెలియజేశాడు. నరేష్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ ఓ పేపర్ లో యంగ్ హీరో క‌థ‌లు సరిగ్గా ఎంచుకోవ‌డం లేద‌ని రాశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ట‌. దానికి న‌రేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. నీకు సంబంధించిన విష‌యం కాదు క‌దా అని అన్నానని తెలిపాడు నరేష్.

దాంతో ఉద‌య్ కిర‌ణ్ ఆ యంగ్ హీరో క‌థ‌లు స‌రిగ్గా ఎంచుకోక‌పోతే అత‌డికి కూడా ఉద‌య్ కిర‌ణ్ కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ఆ పేపర్ లో రాశారని బాధ‌ప‌డ్డాడ‌ట‌. దాంతో న‌రేష్.. ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యాడ‌ట‌. ఆ విషయంతో ఉద‌య్ కిర‌ణ్ ఎంతో డిప్రెష‌న్ లో ఉన్నాడ‌ని నరేష్ కి అర్థ‌మైంద‌ట‌. ఇక ఉద‌య్ కిర‌ణ్ చనిపోయిన త‌ర‌వాత అత‌డి మృతికి డిప్రెష‌న్ కూడా కార‌ణ‌మ‌ని న‌రేష్ కు అనిపించింద‌ని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM