Uday Kiran : ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్ కిరణ్ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అతడు నటించిన శ్రీరామ్ మూవీ ప్లాప్ అవ్వడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.
ఆర్ధిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషితా.. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు.
అతడు మంచి వాడు అని నువ్వు నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు.
అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉదయ్ తన చేతి రాతతో లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…