Turmeric Milk : అర టీస్పూన్ పాల‌లో మ‌రిగించి తీసుకుంటే.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, గుండె పోటు రావు..

October 23, 2022 9:40 AM

Turmeric Milk : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అలాగే షుగర్, జీర్ణసంబంధిత సమస్యలు, నిద్రలేమి ఇలాంటి ఎన్నో రకాల భయంకరమైన దీర్ఘకాలిక సమస్యలు శాశ్వతంగా దూరమవడానికి ఈ పొడిని అర స్పూన్ పాలల్లో వేసుకొని తాగండి. ఈ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు లేదా ఆర్గానిక్ పసుపు, ఒక గ్లాసు పాలు, ఒక అంగుళం అల్లం ముక్క.

ఈ డ్రింక్ తయారీ విధానం:

స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక గ్లాసు పాలను పోయండి. ఇప్పుడు ఇందులో పచ్చి పసుపు కొమ్ముల పొడిని ఒక అరస్పూన్ కలపండి. తర్వాత ఇందులో ఒక ఇంచ్ అల్లం సన్నగా తరిగి వేయండి. ఇప్పుడు ఈ డ్రింక్ ను స్టవ్ సిమ్ లో పెట్టుకొని 2 లేదా 3 పొంగులు వచ్చేవరకు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్ లో వడపోయండి. మీకు ఇష్టమైతే అల్లం నమిమి తినండి. మీకు డయాబెటిస్ లేకపోతే తీపి కోసం కొద్దిగా బెల్లం కానీ తేనె కాని కలుపుకోవచ్చు. ఈ డ్రింక్ ను ఎప్పుడు తీసుకోవాలి: ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ఒక అరగంట ముందు ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ డ్రింక్ మీ శరీరానికి కరెక్ట్ గా పని చేస్తుంది. మీరు షుగర్, టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతుంటే ఈ డ్రింక్ ను ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.

Turmeric Milk take daily for these benefits
Turmeric Milk

పసుపులో ఐరన్ పొటాషియం విటమిన్ బి6, సి, మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అల్లంలో మెగ్నీషియం విటమిన్ బి6, సి సమృద్ధిగా ఉంటాయి. తక్కువ మొత్తంలో క్యాల్షియం ఐరన్ జింక్ కాపర్ కూడా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు ఫ్లూ ఇలాంటి ఎన్నో రకాల వైరస్ సమస్యల నుండి కూడా అల్లం పసుపు మనల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఈ 2 పదార్థాల్లో యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎవరైతే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ డ్రింక్ ను తప్పకుండా తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now