TSRTC : తెలంగాణ ఆర్‌టీసీ ప్ర‌యాణికుల‌కు మ‌ళ్లీ షాక్‌.. పెరిగిన చార్జిలు.. ఎంతంటే..?

April 8, 2022 9:58 PM

TSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌లి కాలంలో ఆర్‌టీసీ బ‌స్సుల్లో చార్జిల‌ను పెంచిన విషయం విదిత‌మే. అయితే తాజాగా మ‌రోమారు ఈ చార్జిల‌ను పెంచారు. ఈ మేర‌కు టీఎస్ఆర్‌టీసీ వైస్ చైర్మ‌న్‌, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. శ‌నివారం నుంచి పెంచిన చార్జిలు అమ‌లులోకి వ‌స్తాయ‌ని చెప్పారు. ప‌ల్లె వెలుగు, సిటీ ఆర్డిన‌రీ బ‌స్సుల్లో డీజిల్ సెస్ పేరిట టిక్కెట్‌కు రూ.2 అద‌నంగా వ‌సూలు చేయనున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, ఏసీ బ‌స్సుల్లో టిక్కెట్‌కు రూ.5 అద‌నంగా ప్ర‌యాణికుల నుంచి వ‌సూలు చేయ‌నున్నారు.

TSRTC increases bus fares again know how much it is
TSRTC

డీజిల్ సెస్ పేరిట ఈ చార్జిల‌ను పెంచి వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలిపారు. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను ఎందుకు పెంచాల్సి వ‌చ్చిందో స‌జ్జ‌నార్ వివ‌రించారు. గ‌తంలో ఆర్‌టీసీ బ‌స్సుల్లో వినియోగించే హెచ్ఎస్‌డీ ఆయిల్ ధ‌ర లీట‌ర్‌కు రూ.83 ఉండేద‌ని.. కానీ ఇప్పుడు దాని ధ‌ర లీట‌ర్‌కు రూ.118గా ఉంద‌ని.. ఈ ధ‌ర ఎప్పుడో పెరిగినా.. ఆర్‌టీసీ ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్టాల‌ను భ‌రిస్తూనే వ‌స్తుంద‌ని.. అయితే ఇన్ని న‌ష్టాల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని.. క‌నుక‌నే చార్జిల‌ను మ‌రోమారు పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని స‌జ్జ‌నార్ తెలిపారు. ప్ర‌జ‌లు ఈ విషయాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని ఆయన కోరారు.

హెచ్ఎస్‌డీ ఆయిల్‌ను ఆర్‌టీసీ రోజుకు 6 ల‌క్ష‌ల లీట‌ర్ల మేర వినియోగిస్తుంద‌ని.. అయితే ఈ ఆయిల్ ధ‌ర పెరిగినందున న‌ష్టాల‌ను భ‌రించ‌లేకే చార్జిల‌ను పెంచాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. కాగా పెంచిన ధ‌ర‌లు శ‌నివారం నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా టీఎస్ఆర్‌టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now