Trolls On Dil Raju : ట్రోలింగ్‌కు గుర‌వుతున్న దిల్ రాజు.. తాత‌య్య వ‌య‌సులో అవ‌స‌రమా.. అంటూ..?

June 30, 2022 12:24 PM

Trolls On Dil Raju : ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు ఏది చేసినా నెటిజ‌న్లు ట్రోలింగ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు. ట్రోల్స్ బారిన ప‌డి కొంద‌రు సెల‌బ్రిటీలు టెంప‌రరీగా సోష‌ల్ ఖాతాల‌ను డీయాక్టివేట్ కూడా చేస్తున్నారు. గ‌తంలో కొంద‌రు సెల‌బ్రిటీల‌కు ఇలాగే జ‌రిగింది. అయితే ఇప్పుడు తాజాగా దిల్ రాజు అన‌వ‌స‌రంగా ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు. ఆయ‌న భార్య తేజ‌స్విని అలియాస్ వైఘా రెడ్డి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన విష‌యం విదిత‌మే. జూన్ 29న రాత్రి ఆమె ప్ర‌స‌వించింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు అంద‌రూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఎప్పుడు మ్యాట‌ర్ దొరుకుతుందా.. ఎప్పుడు ఎవ‌రిని ట్రోల్ చేద్దామా.. అని ఎదురు చూస్తున్న వాళ్ల‌కు దిల్ రాజు తండ్రి అయ్యాడ‌న్న వార్త చెవుల్లో అమృతంలా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.

దిల్ రాజుకు ఇప్ప‌టికే ఓ కుమార్తె ఉన్న విష‌యం విదిత‌మే. ఆమె మొద‌టి భార్య సంతానం. ఆమెకు ఇప్ప‌టికే పెళ్ల‌యి పిల్ల‌లు కూడా ఉన్నారు. అంటే దిల్ రాజు ఆల్రెడీ తాత అయ్యార‌న్న‌మాట‌. ఇదే విష‌యాన్ని చెబుతూ కొంద‌రు నెటిజ‌న్లు ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తాత‌గా ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు ఆయ‌నకు ఇదంతా అవ‌స‌ర‌మా.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అని కొంద‌రు నెటిజ‌న్లు అంటుండ‌గా.. ఇంకొంద‌రు మాత్రం ఎవ‌రైనా స‌రే తండ్రి అయ్యాక తాత అవుతారు. కానీ దిల్ రాజు మాత్రం వెరైటీగా తాత అయ్యాక తండ్రి అయ్యారు.. అంటూ విమ‌ర్శిస్తున్నారు.

Trolls On Dil Raju netizen comments
Trolls On Dil Raju

అయితే కొంద‌రు మాత్రం దిల్ రాజుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఆయ‌న వివాహం ఆయ‌న ఇష్టం. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్లో మ‌న జోక్యం చేసుకోవ‌డం ఎందుకు.. మ‌నిషి అన్నాక తోడు అవ‌స‌రం.. అందుకు వ‌య‌స్సుతో ప‌నిలేదు.. అందుక‌నే ఆయ‌న మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు.. ఇంకా ఓపిక ఉంది కాబ‌ట్టే బిడ్డ‌ను క‌న్నారు.. ఇందులో ట్రోల్ చేయాల్సిన అవ‌సరం ఏముంది.. అంటూ మ‌రికొంద‌రు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now