Trisha : ఆ ఘ‌న‌త సాధించిన తొలి త‌మిళ హీరోయిన్ త్రిష‌నే..!

November 4, 2021 12:14 PM

Trisha : చెన్నై చంద్రం త్రిష నాలుగు ప‌దుల వ‌యస్సులోనూ తెగ సంద‌డి చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో నానా హంగామా చేస్తోంది. ప్ర‌స్తుతం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ సినిమాలో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న ‘రామ్‌’ అనే చిత్రంలో ఆమె న‌టిస్తోంది. మ‌రోవైపు డిజిట‌ల్ రంగంలో కూడా స‌త్తా చాటుతోంది. ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఇత‌ర భాష‌ల్లోనూ ఈ వెబ్ సిరీస్‌ను అనువదించ‌నున్నారు. స‌స్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.

Trisha is the first tamil actress to get uae golden visa

తాజాగా త్రిష‌కి అరుదైన గౌర‌వం ల‌భించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. ఇదే విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ ఆనందం వ్య‌క్తం చేసింది త్రిష‌. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు.

తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్‌ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now