Pushpa Movie : పుష్ప సినిమాను ప్రేర‌ణ‌గా తీసుకున్నాడు.. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేయ‌బోయి ప‌ట్టుబ‌డ్డాడు..!

February 3, 2022 10:35 PM

Pushpa Movie : అల్లు అర్జున్, ర‌ష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మొద‌టి పార్ట్ ఎంత హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్ర చంద‌నం చెట్ల‌ను న‌రికే కూలీగా జీవితాన్ని ప్రారంభించి చివ‌ర‌కు వాటిని అమ్మే లీడ‌ర్ స్థాయికి ఎదుగుతాడు. ఈ క్ర‌మంలోనే సినిమాలో పుష్ప రాజ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ చివ‌ర‌కు స్మ‌గ్లింగ్ గ్యాంగ్‌కు లీడ‌ర్ అవుతాడు.

took Pushpa Movie as inspiration man caught by police for smuggling red sandalwood
Pushpa Movie

ఈ సినిమాలో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ ప్ర‌ధాన అంశంగా ఉంటుంది. పుష్ప రాజ్ ఎర్ర చంద‌నాన్ని అనేక విధాలుగా స్మ‌గ్లింగ్ చేస్తాడు. పోలీసుల‌కు దొర‌క్కుండా అత్యంత చాక‌చ‌క్యంగా ఎర్ర చంద‌నం లోడ్‌ల‌ను చెక్ పోస్టుల‌ను దాటిస్తాడు. అయితే దీన్నే ప్రేర‌ణ‌గా తీసుకున్న ఓ వ్య‌క్తి ఎర్ర చందనాన్ని స్మ‌గ్లింగ్ చేయ‌బోయాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ వ్య‌క్తి రూ.2.50 కోట్ల విలువైన ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను లారీ వేసుకుని పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. అయితే త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డ‌కుండా ఉండేందుకు గాను పుష్ప సినిమాలోలాగా.. లారీలో పైన కూర‌గాయ‌ల‌ను పెట్టాడు. వాటి కింద ఎర్ర చంద‌నం క‌ల‌ప‌ను ఉంచాడు. ఈ క్ర‌మంలోనే చెక్ పోస్ట్ వ‌ద్ద పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. అయితే మొద‌ట వారికి అనుమానం క‌ల‌గ‌లేదు. కానీ ఎందుకైనా మంచిద‌ని లారీ మొత్తాన్ని మ‌ళ్లీ త‌నిఖీ చేశారు. దీంతో చివ‌ర‌కు అందులో ఎర్ర చంద‌నం క‌ల‌ప ప‌ట్టుబ‌డింది. ఈ క్ర‌మంలో ఆ క‌ల‌ప‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్య‌క్తిని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.

అయితే పుష్ప సినిమాపై ప్ర‌ముఖ స‌హ‌స్ర అవధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా విమ‌ర్శ‌లు చేశారు. స్మ‌గ్లింగ్‌ను గొప్ప‌గా చూపించ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ సినిమా చూసి స‌మాజం చెడిపోతే అందుకు ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. అలా ఆయ‌న అన్న త‌రువాతే పైన తెలిపిన సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now