Thurumkhanlu : ఆసక్తిని కలిగిస్తున్న తురుమ్‌ ఖాన్‌లు.. చిత్ర ఫస్ట్‌ లుక్‌..!

Thurumkhanlu : ప్రస్తుత తరుణంలో సినిమా చిన్నదా.. పెద్దదా.. బడ్జెట్‌ ఎంత ? అన్న విషయంతో సంబంధం లేకుండా కొందరు సినిమాలను తీస్తూ హిట్‌ కొడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా చిన్న సినిమాలతోనే పరిచయం అయి.. ప్రస్తుతం టాప్‌ లెవల్‌కు ఎదిగారు. అందులో భాగంగానే మరో సినిమా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

శివకల్యాణ్‌ దర్శకుడిగా కేకే సినిమాస్‌ పతాకంపై కె.కల్యాణ్‌ రావు నిర్మిస్తున్న తాజా చిత్రం తురుమ్‌ ఖాన్‌లు. డార్క్‌ హ్యూమర్‌ జానర్‌లో రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఇందులో శ్రీరామ్‌ నిమ్మల హీరోగా నటించాడు. అలాగే దేవరాజ్ పాలమూర్‌, అవినాష్‌ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్‌ సింగంలు కీలక పాత్రల్లో నటించారు. చరణ్‌ అంబటి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా, బొంతల నాగేశ్వర్‌ రెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.

ఈ మూవీకి గగన్‌ కేఎస్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు. కాగా ఈ మూవీకి చెందిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా లాంచ్‌ చేశారు. టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో శ్రీవిష్ణు ఈ మూవీ పోస్టర్‌ను లాంచ్‌ చేస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్రం పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

కాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోనే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత శివ కల్యాణ్‌ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మ అనే అమ్మాయిలను చేరుకునేందుకు ఆరాట పడుతుంటారు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన శ్రీకృష్ణుడు వారి సమస్యలను ఎలా పరిష్కరించాడు.. అన్నదే తురుమ్‌ ఖాన్‌లు చిత్ర కథ అని తెలియజేశారు. కాగా ఆయన వ్యాఖ్యలతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా హిట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM