Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది సమంత.
టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం సమంత వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దానికి కారణం ఓ బాలీవుడ్ స్టార్ హీరో అంటూ వార్తలొచ్చాయి. సమంతకు క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో.. నీపై జనాల్లో నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కువవుతోంది. నువ్వు కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండు.. అని సలహా ఇచ్చినట్లు సమాచారం. అందుకే సమంత సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
కానీ ప్రస్తుతం మరో వార్త వైరల్ అవుతోంది. సమంత అదిరిపోయే ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్ నే మరొకటి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ గా నటించిన సిట్టాల్ అనే అమెరికా వెబ్ సిరీస్ ను ఇండియన్ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరో వరుణ్ కి హీరోయిన్ గా సమంత ఎంపికైందట. ఈ వెబ్ సిరీస్ లో భారీ యాక్షన్స్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట. హీరో వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత భారీ యాక్షన్ స్టంట్స్ చేయనుందట. అందుకు ట్రైనింగ్ 2, 3 నెలలు ఉంటుందట. అయితే ఈ సిరీస్‌లో సమంతకు సంబంధించి ఎలాంటి సీన్స్ ఉంటాయోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి సమంత సర్‌ప్రైజ్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…