Samantha : ఆ ఒక్క విష‌యంలోనే స‌మంత‌-చై కి చెడిందా ?

December 15, 2022 7:58 AM

Samantha : ఇప్పుడు ఏ ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ వ‌చ్చినా అది స‌మంత‌ – నాగ చైత‌న్య విడాకుల గురించే అయి ఉంటోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడపోవడం ఏంటన్న చర్చ నడుస్తోంది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలసి ఉండలేమని ప్రకటించి అభిమానులను నిరాశలో ముంచేశారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెబుతున్నారు.

this is the main reason behind samantha naga chaithanya divorce

కొంద‌రు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అని చెబుతుండ‌గా, మరికొంద‌రు ప‌బ్లిసిటీ డిజైన‌ర్ కార‌ణం అంటున్నారు. తాజాగా పిల్ల‌ల విష‌యంలోనే వారిద్ద‌రు విడిపోయిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. గత ఏడాది కరోనా సమయంలో సమంత, నాగ చైతన్య సినిమాలు లేని కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌య్యారు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల‌ కోసం ప్లాన్ చేయ‌మ‌ని అక్కినేని ఫ్యామిలీ చెప్ప‌డంతో అందుకు స‌మంత స‌సేమీరా అని చెప్పుకొచ్చింద‌ట‌.

తనకు పిల్లలు కనాలనే ఉద్దేశం ఇప్పట్లో లేదని.. అసలు పిల్లల్ని కనను అంటూ చెప్పేసరికి.. అక్కినేని ఫ్యామిలీ షాక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. క‌చ్చితంగా పిల్లలు ఉండాల్సిందే.. అంటూ కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ సమంతకు చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించినా కూడా.. ఆమె వినడానికి సిద్ధంగా లేదని.. చివరికి విడాకులు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాయని.. ఇరు కుటుంబాలు న‌మ్మడంతో ఇంత‌దాకా వ‌చ్చిన‌ట్టు కొంద‌రు చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment