Chiranjeevi : ఇంగ్లిష్‌లోకి డబ్బింగ్‌ అయిన చిరంజీవి మూవీ.. 4 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది..!

Chiranjeevi : కౌబాయ్ సినిమా అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు మూవీ. ఈ మూవీ తెలుగులో తొలి కౌబాయ్ సినిమా. ఇలా కృష్ణ అప్ప‌ట్లో తొలిసారిగా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, క‌ల‌ర్‌ను కూడా ఆయ‌నే మొద‌ట‌గా ప‌రిచ‌యం చేశారు. అయితే కౌబాయ్ సినిమా అంటే మ‌న‌కు ముందుగా కృష్ణ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌రువాత చిరంజీవి న‌టించి కొద‌మ సింహం మూవీ గుర్తుకు వ‌స్తుంది. ఈ మూవీ అప్ప‌ట్లో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. కౌబాయ్ సినిమా అంటే ఇలాగే ఉండాల‌ని చాటి చెప్పింది.

Chiranjeevi

వాస్త‌వానికి కొద‌మ సింహం చేసే స‌మ‌యంలో చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నారు. ఆయ‌న అప్ప‌టికే కొండ‌వీటి దొంగ‌, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొద‌మ సింహంకు చాలా టైమ్ కేటాయించారు. అప్పట్లో ఆయ‌న మూవీ తీసేందుకు గ‌రిష్టంగా 2 నెల‌లు ప‌డితే కొద‌మ సింహంకు అంత‌కన్నా రెట్టింపు స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఎట్ట‌కేల‌కు సినిమా పూర్త‌యింది. కొద‌మ సింహం సినిమాకు స‌త్యానంద్ డైలాగ్స్ రాయ‌గా.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స్ర్కీన్ ప్లే అందించారు. నిర్మాత నాగేశ్వ‌ర్ రావు ఈ మూవీని నిర్మించ‌గా.. ద‌ర్శ‌కుడు ముర‌ళీ మోహ‌న్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో రాధ‌, వాణీ విశ్వ‌నాథ్ లతోపాటు సోన‌మ్ అనే హిందీ న‌టి కూడా యాక్ట్ చేసింది. అలాగే కైకాల స‌త్య‌నారాయ‌ణ, మోహ‌న్‌బాబు, గొళ్ల‌పూడి, క‌న్న‌డ ప్ర‌భాక‌ర్‌, ప్రాణ్ (హిందీ) లు ఇందులో కీల‌క‌పాత్ర‌లు పోషించారు.

కొద‌మ సింహం మూవీ షూటింగ్‌ను 5 రాష్ట్రాల్లో చేశారు. ఇందులో హార్స్ రైడింగ్ కోసం చిరంజీవి అప్ప‌ట్లో రాజ‌స్థాన్‌లో గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నారు. చెంగల్‌ప‌ట్టులో కౌబాయ్ సెట్ వేశారు. అందులో 7 రోజుల పాటు షూటింగ్ సాగింది. 1989 సెప్టెంబ‌ర్ 21న ప్రారంభ‌మైన షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ మూవీలో మెగాస్టార్‌తో ప్ర‌భుదేవా స్టెప్పులేయించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే మూవీలోని పిల్లో జాబిల్లో.., ఘుం ఘుమాయించు కొంచెం.., చ‌క్కిలి గింత‌ల రాగం.., జ‌పం జ‌పం కొంగ జ‌పం.. అనే పాట‌లు బంప‌ర్ హిట్ అయ్యాయి. ఎక్క‌డ చూసినా ఈ పాట‌ల‌నే వినేవారు. ఇక ఈ మూవీ తీసేందుకు అప్ప‌ట్లో రూ.3.50 కోట్లు ఖ‌ర్చు కాగా అంత‌కన్నా ఎక్కువ‌గానే భారీ మొత్తంలో ఈ మూవీ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది.

ఈ క్ర‌మంలోనే ఈ మూవీ షూటింగ్‌ను ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. అడ‌వుల్లో చ‌లికి వ‌ణుకుతూ, ఎండ‌కు ఎండుతూ క‌ష్ట‌ప‌డి సినిమా తీశారు. 1990, జూలైలో ఆడియో విడుద‌ల కాగా పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 1990, ఆగ‌స్టు 9వ తేదీన మూవీ విడుద‌లైంది. అప్ప‌టికే కొండ‌వీటి దొంగ‌, జ‌గ‌దేక వీరుడు సినిమాలు హిట్ అయి ఉండ‌డం.. కౌబాయ్-నిధి స్టోరీ కావ‌డం.. పాటలు, డ్యాన్స్‌లు.. క‌థ.. మ్యూజిక్‌.. వంటి అనేక అంశాల వ‌ల్ల కొద‌మ సింహం ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ సినిమాలో చిరంజీవి తాగిన సిగ‌రెట్ బ్రాండ్‌కు అప్ప‌ట్లో తెగ డిమాండ్ కూడా ఏర్ప‌డింది. ఇక ఇందులో మోహ‌న్ బాబు విల‌న్ పాత్ర‌లో సుడిగాలి క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఆయ‌న పాత్ర‌ను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు గుర్తు చేసుకుంటారు. ఇది చిరంజీవితో ఆయ‌న‌కు చివ‌రి చిత్రం కావ‌డం విశేషం. ఇక సినిమాకు ప‌నిచేసిన రాజ్ కోటి ఈ మూవీకి గాను సంగీతం కోసం అధునాత‌న వాయిద్య ప‌రిక‌రాలను అప్ప‌ట్లో తెప్పించారు. దీంతో ఈ మూవీ పాట‌లు హిట్ అయ్యాయి.

ఇక కొద‌మ సింహం మూవీ మొద‌టి వార‌మే భారీ స్థాయిలో క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. తొలి వారం ఈ మూవీ రూ.1.20 కోట్ల గ్రాస్ సాధించ‌గా.. నైజాంలో 44 థియేట‌ర్ల‌లో రూ.30 ల‌క్ష‌ల గ్రాస్ సాధించింది. జంట న‌గ‌రాల్లో 30 థియేట‌ర్ల‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ మూవీ 16 కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌గా.. 4 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.

అయితే ఈ మూవీ 100 రోజుల వేడుక‌ను అప్ప‌ట్లో చెన్నైలోని తాజ్ హోట‌ల్‌లో నిర్వ‌హించ‌గా.. ఈ కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీకాంత్‌, వెంక‌టేష్‌లు ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. ఈ వేడుక‌లో ర‌జనీకాంత్ మాట్లాడుతూ.. సూప‌ర్ స్టార్ తాను కాద‌ని.. చిరంజీవి అని పొగిడారు. ఇక కొద‌మ సింహం సినిమాను హంట‌ర్స్ ఆఫ్ ది ఇండియ‌న్ ట్రెజ‌ర్ అనే పేరిట ఇంగ్లిష్‌లోకి డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇలా ఇంగ్లిష్‌లోకి రిలీజైన రెండో కౌబాయ్ సినిమా కొద‌మ సింహం కావ‌డం విశేషం. మొద‌టి సినిమా కృష్ణ న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు. అయితే కొద‌మ సింహం సినిమాను రామ్ చ‌ర‌ణ్‌తో రీమేక్ చేయాల‌ని చూస్తున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM