Khiladi Movie : ఖిలాడి మూవీ ద‌ర్శ‌కుడికి, ర‌వితేజ‌కు ప‌డ‌డం లేదా ? అందుక‌నేనా అలా..?

February 10, 2022 10:22 AM

Khiladi Movie : ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మ‌లోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక‌ను తాజాగా నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌వితేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

things not going well between Khiladi Movie director and ravi teja
Khiladi Movie

ప్రీ రిలీజ్ వేడుక‌లో ర‌వితేజ ఈ సినిమాకు ప‌నిచేసిన అంద‌రినీ పొగిడారు. అంద‌రు టెక్నిషియ‌న్ల‌ను మెచ్చుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా వారికే చెందుతున్నారు. అయితే నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ గురించి మాట్లాడుతూ.. ప్ర‌తి ప్రొడ్యూస‌ర్ సినిమాకు డ‌బ్బులు పెట్టి చూస్తూ ఊరుకోవ‌ద్ద‌ని, ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకోవాల‌ని, చాలా విష‌యాలు తెలుస్తాయ‌ని అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు ర‌మేష్ వర్మ గురించి ర‌వితేజ పెద్ద‌గా మాట్లాడ‌లేదు.

సాధార‌ణంగా ఏ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో అయినా స‌రే.. నిర్మాత, ద‌ర్శ‌కుల‌ను హీరోలు, హీరోయిన్లు, అందుకు ప‌నిచేసిన‌వారు మెచ్చుకుంటుంటారు. కానీ ర‌వితేజ మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్స్ చేశారు. నిర్మాతపై ఆ విధంగా మాట్లాడారు. ఇక ద‌ర్శ‌కుడి గురించి అయితే పెద్ద‌గా చెప్ప‌లేదు. దీంతో ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు, ర‌వితేజ‌కు ప‌డ‌డం లేద‌నే వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి. అందుక‌నే ర‌వితేజ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు కూడా స‌రిగ్గా హాజ‌రు కాలేదట‌. డ‌బ్బింగ్‌కు టైముకు చేరుకోలేద‌ట‌. అలాగే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కువ‌గా పాల్గొన‌డం లేద‌ని తెలిసింది.

ఖిలాడి మూవీ విడుద‌ల‌కు ముందే మంచి బిజినెస్ చేసింద‌ని.. లాభాలు బాగానే వ‌చ్చాయ‌ని చెబుతూ నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు ఓ ఖ‌రీదైన కారును బ‌హుమ‌తిగా ఇచ్చారు. అయితే ఇదే ర‌వితేజ‌కు న‌చ్చ‌లేద‌ని.. సినిమా విడుద‌లయ్యాక అలా చేస్తే ఓకే.. కానీ విడుదల‌కు ముందే ఇలా చేస్తే అవ‌న‌స‌ర ఆడంబ‌రాల‌కు పోయిన‌ట్లు ఉంటుంద‌ని.. ర‌వితేజ భావించార‌ట‌. క‌నుక‌నే ఆయ‌న ద‌ర్శ‌కుడితో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటున్నార‌ని తెలిసింది. అయితే చిత్ర యూనిట్ చెబుతున్న‌ట్లు నిజంగానే ఈ మూవీ బాగానే బిజినెస్ చేసిన‌ట్ల‌యితే.. సినిమా బాగా ఆడాలి. మ‌రి ఈ మూవీ శుక్ర‌వారం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now