Lemon : వార్నీ.. ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. 60 కేజీల నిమ్మ‌కాయ‌ల‌ను కాజేశారు..!

Lemon : ప్ర‌స్తుత త‌రుణంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లే కాదు.. ప‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువులు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు కూడా చుక్క‌ల‌నంటుతున్నాయి. ముఖ్యంగా గ‌త 10 రోజుల నుంచి నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు మరీ ఆకాశాన్నంటాయి. కేజీ నిమ్మ‌కాయ‌లు ఏకంగా రూ.300కు పైగానే ప‌లుకుతున్నాయి. దీంతో సామాన్యులు నిమ్మ‌కాయ‌ల‌ను కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంద‌రు వాటిని చోరీ కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

Lemon

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్‌లో ఉన్న బ‌జారియా అనే ప్రాంతంలోని బ‌హ‌దూర్ గంజ్ మొహ‌ల్లా అనే ఏరియాలో మ‌నోజ్ క‌శ్య‌ప్ అనే వ్య‌క్తి కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా అత‌ను ఓ రోజు రాత్రి త‌న గోడౌన్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూసే సరికి గోడౌన్ తాళం ప‌గ‌ల‌గొట్ట‌బ‌డి ఉంది. అలాగే లోప‌ల అన్ని కూర‌గాయ‌లు చింద‌ర వంద‌ర‌గా ప‌డి ఉన్నాయి. తీరా చూస్తే కొన్నింటిని చోరీ చేసిన‌ట్లు అర్థ‌మైంది.

మొత్తం 60 కేజీల నిమ్మ‌కాయ‌లు, 40 కిలోల ఉల్లిపాయ‌లు, 38 కిలోల వెల్లుల్లి చోరీకి గుర‌య్యాయ‌ని మనోజ్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో వాటిని చోరీ చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM