OTT : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

February 7, 2022 3:10 PM

OTT : వారం మారిందంటే చాలు ప్రేక్షకులు కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవి విడుదల అవుతాయా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. థియేటర్లలో వచ్చే సినిమాలతోపాటు.. ఓటీటీల్లో వచ్చే సినిమాలు, సిరీస్‌లను చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

these movies and series releasing this week in theatres and OTT
OTT

చియాన్‌ విక్రమ్‌, ఆయన కుమారుడు ధ్రువ్‌ విక్రమ్‌లు కలసి నటించిన సినిమా మహాన్. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే విడుదలవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 10వ తేదీన ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో సిమ్రాన్‌ ముఖ్య పాత్రలో నటించింది.

మాస్‌ మహారాజ రవితేజ నటించిన ఖిలాడి చిత్రం ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రవితేజ డ్యుయల్‌ రోల్‌ చేసినట్లు తెలుస్తుండగా.. ఆయన పక్కన డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. అలాగే అనసూయ మరో కీలకపాత్ర పోషించింది.

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరిలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సెహరి. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సుమంత్‌, నైనా గంగూలీ, వర్షిణి సౌందర రాజన్‌లు నటించిన మళ్లీ మొదలైంది మూవీ ఈ నెల 11వ తేదీన జీ5 ఓటీటీలో విడుదల కానుంది.

ప్రియమణి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం భామా కలాపం. ఈ మూవీని ఈ నెల 11వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ చేయనున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టిలు హీరోయిన్లుగా నటించిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ట్రైలర్‌కు విశేషమైన రీతిలో స్పందన లభిస్తోంది. ఈ మూవీని ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

దీపికా పదుకొనె, సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గెహ్రాయియా. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన అమెజాన్‌ లో విడుదలవుతోంది.

అలాగే మహేష్‌ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్ గల్లా హీరోగా వచ్చిన చిత్రం.. హీరో.. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీని ఈ నెల 11వ తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ చేయనున్నారు.

ఈ నెల 8వ తేదీన నెట్‌ ఫ్లిక్స్‌లో జపాన్‌కు చెందిన లవ్ ఈజ్ బ్లైండ్‌ అనే రియాలిటీ షో ప్రసారం కానుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లోనే 9వ తేదీన క్యాచింగ్‌ కిల్లర్జ్‌ సీజన్‌ 2 స్ట్రీమ్‌ అవుతుంది. అదే రోజు జీ5లో సింగ పెన్నె పార్ట్‌ 2 ప్రసారం అవుతుంది. అదే తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్నో డ్రాప్‌ అనే కొరియన్‌ టీవీ షో ప్రసారం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now