Unstoppable With NBK : బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకి అవాంతరం.. కార‌ణాలు ఏంటి ?

November 17, 2021 3:10 PM

Unstoppable With NBK : వెండితెర‌పై సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిన బాల‌కృష్ణ ఇప్పుడు ఆహా కోసం హోస్ట్‌గా మారిన విష‌యం తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో ఆహాలో ప్ర‌సారం అవుతుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు సందడి చేయగా రెండవ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని హాజరు అయ్యాడు. మోహన్ బాబు, నాని లు వచ్చిన రెండు ఎపిసోడ్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది.

there is a litter interruption to Unstoppable With NBK

ఇక మూడో ఎపిసోడ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేసిన‌ట్టు తెలియ‌గా, దీనికి చిన్న బ్రేక్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. మూడవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ శుక్రవారం అన్ స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లేకపోవచ్చు అంటున్నారు. బాలయ్యకు చిన్న సర్జరీ అవ్వడంతోపాటు విజయ్ దేవరకొండ అమెరికాకు లైగర్ షూటింగ్ కోసం వెళ్లాడు. ఆయ‌న వ‌చ్చాక మూడో ఎపిసోడ్ షూట్ చేసి స్ట్రీమ్ చేయ‌నున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో క‌లిసి చేస్తున్న చిత్రం అఖండ. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ‌రోవైపు బాల‌య్య 107వ సినిమా లాంచ్ కాగా, త్వ‌ర‌లోనే షూటింగ్ జ‌రుపుకోనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now