Sai Pallavi : సాయి పల్లవి సక్సెఫుల్ డ్యాన్స్ వెనుక ఇంత బాధను భరిస్తుందా.. నిజంగా హ్యాట్సాఫ్‌..!

August 19, 2022 11:51 AM

Sai Pallavi : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు.

అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే.. నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని కూడా ప్రశంసిస్తూ ఉంటారు. తన మొదటి తెలుగు సినిమా ఫిదా నుండి ఇటీవలి శ్యామ్ సింగరాయ్ వరకు, పల్లవి ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. కానీ ఆమె నటన వెనుక చాలా బాధ మరియు కృషి ఉంది. సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సాంగ్స్ పిక్చరైజేషన్ టైంలో తన పీరియడ్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది. పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా ఉండే బాధ వర్ణనాతీతం అని పల్లవి పేర్కొంది.

the success behind Sai Pallavi dance is very hard
Sai Pallavi

షూటింగ్ సమయంలో ఆమె 2-3 రోజులు నొప్పిని భరించి, ఒకేసారి విశ్రాంతి తీసుకోవలసి వస్తుందని తెలిపింది. పల్లవి నిద్రపోతున్నప్పుడు తన తండ్రి ఆమె పాదాలకు మసాజ్ చేసేవాడని తన పెయిన్ ఫుల్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. శ్యామ్ సింగరాయ్‌లోని క్లాసికల్ సాంగ్ నుంచి తన కెరీర్‌లో చాలా పాటలను, పీరియడ్స్‌లో ఉన్నప్పుడు తీయాల్సి వచ్చిందని సాయి పల్లవి వివరించింది. దీన్నిబట్టి సినిమాల పట్ల సాయి పల్లవి అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి విడుదయ్యాయి. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now